Rohit-Rahul
ఇంగ్లాండ్ ఓపెనర్లు పవర్ ప్లే ముగిసే సమయానికి సమయానికి 63 పరుగులు చేశారు. అంటే సాధించాల్సిన లక్ష్యంలో 33 శాతం పవర్ ప్లేలో వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా భారత ఓపెనర్లు 50+ భాగస్వామ్యం కూడా జోడించలేకపోయారు...
KL Rahul
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో జోడించిన అత్యధిక భాగస్వామ్యం 27 పరుగులు మాత్రమే. ఆఖరికి జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కూడా కెఎల్ రాహుల్, మొదటి ఓవర్‌లో పరుగులేమీ రాబట్టలేక మెయిడిన్ ఓవర్ ఇచ్చాడు. జింబాబ్వేపై మొదటి 10 బంతుల్లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి చేసింది 2 పరుగులే...
Image credit: PTI
2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా ఫైనల్ చేరింది. అయితే విరాట్ కోహ్లీ ఒంటరిపోరాటం వల్లే ఆ టోర్నీలోనూ భారత జట్టు గెలుస్తూ వచ్చింది. 8 ఏళ్ల క్రితం జరిగిన ఆ టోర్నీలో శిఖర్ ధావన్- రోహిత్ శర్మ కలిసి ఓపెనింగ్ చేశారు. ఈ ఇద్దరూ కలిసి 5.82 రన్‌రేట్‌తో పరుగులు చేశారు...
Image credit: Getty
అంతకుముందు 2010 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో గౌతమ్ గంభీర్- మురళీ విజయ్ కలిసి ఓపెనింగ్ చేశారు. రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చింది. ఈ టోర్నీలో భారత ఓపెనింగ్ జోడి రన్‌రేట్ 5.34 మాత్రమే. ఇప్పటిదాకా టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఇదే అత్యల్ప ఓపెనింగ్ బ్యాగస్వామ్యం రన్‌రేట్‌గా ఉండేది..
Image credit: PTI
అయితే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో కొడతాం... అని చెప్పిన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కలిసి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అంతకంటే దారుణంగా ఆడారు. రోహిత్- రాహుల్ ఓపెనింగ్ జోడి రన్‌రేట్ కేవలం 4.98 మాత్రమే...
KL Rahul
ఐపీఎల్, బీబీఎల్, ది హండ్రెడ్ వంటి టోర్నీల రాకతో పవర్ ప్లేలో ఓపెనర్ల బ్యాటింగ్ పూర్తిగా మారిపోయింది. మొదటి బంతి నుంచే సిక్సర్లు, ఫోర్లు బాదుతూ బౌలర్లపై ప్రెషర్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు బ్యాటర్లు. కానీ రోహిత్, రాహుల్ మాత్రం అగ్రెసివ్ యాటిట్యూడ్ అని చెప్పి... పాత కాలం టెస్టు బ్యాటింగ్‌ని తలపించారు..
rohit rahul
జింబాబ్వే, సౌతాఫ్రికాలతో జరిగిన మ్యాచుల్లో తొలి ఓవర్ మెయిడిన్ ఇచ్చిన కెఎల్ రాహుల్, భయపడుతూ బ్యాటింగ్ చేస్తున్నట్టు కనిపించాడు కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రమైన ప్రెషర్‌తో బ్యాటింగ్ చేశాడు. ఫలితం టీమిండియా నాకౌట్ నుంచే వాకౌట్ చేసింది...