పాక్ బౌలర్లు, భారత బౌలర్లలా చేతకాని వాళ్లు కాదని ఇంగ్లాండ్‌కి తెలుసు... షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్...

First Published | Nov 13, 2022, 1:39 PM IST

2020 వరకూ ప్రపంచదేశాలకు వణుకు పుట్టించిన టీమిండియా బౌలింగ్ యూనిట్ ఇప్పుడు వికెట్లు తీయలేక చతికిలపడుతూ ట్రోలింగ్‌కి టార్గెట్ అవుతోంది. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీతో పాక్‌తో మ్యాచ్‌ తర్వాత 2022 టీ20 వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు భారత బౌలర్లు... ఫలితంగా రెండు మ్యాచుల్లోనూ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది టీమిండియా...

టీ20 వరల్డ్ కప్ 2022 గ్రూప్ 2 టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరిన భారత జట్టు, ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయలేక 10 వికెట్ల తేడాతో ఓడింది.. ఈ మ్యాచ్ తర్వాత పాక్ ప్రధాని షాబజ్ షరీఫ్ కూడా టీమిండియా బౌలర్లను ట్రోల్ చేశాడు.

Arshdeep Singh

‘అయితే ఈ ఆదివారం... 152/0 వర్సెస్ 170/0 అన్నమాట...’ అంటూ ట్వీట్ చేశాడు షరీఫ్...
2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 151 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. దీంతో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో గెలిచిన రెండు జట్ల మధ్య పోటీ అంటూ వ్యంగ్యంగా ఇలా ట్వీట్ చేశాడు షరీఫ్. ఏడాదిలో రెండు సార్లు భారత బౌలర్లు ఒక్క వికెట్ తీయలేక చతికిలపడడం... క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది...


ఇదే అదునుగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, టీమిండియాని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, టీమిండియా బౌలింగ్ యూనిట్‌ని చేతకాని బౌలర్లుగా తేల్చేశాడు. టీమిండియా గురించి, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ యూట్యూబ్ వ్యూస్ రాబట్టుకునే అక్తర్, ఈసారి భారత బౌలింగ్ యూనిట్‌ని, పాక్ బౌలింగ్ యూనిట్‌ని పోల్చి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

‘ఇంగ్లాండ్‌కి పాకిస్తాన్ జట్టు గురించి బాగా తెలుసు. టీమిండియాపై గెలిచిన తర్వాత వారి కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంది. అయితే పాకిస్తాన్ బౌలర్లు, ఇండియా బౌలర్లలా చేతకాని వారు కాదు. ఈ విషయం ఇంగ్లాండ్‌కి కూడా బాగా తెలుసు. పాక్ బౌలర్లను ఎదుర్కొని , వరల్డ్ కప్ గెలవడం అంత ఈజీ కాదు...

Image credit: Getty

ఇంతకుముందు పాకిస్తాన్ బ్యాటింగ్ భారం మొత్తం బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లపైనే ఆధారపడి ఉండేది. అయితే ఈ టోర్నీలో వాళ్లు పెద్దగా ఆడలేదు. అయినా పాకిస్తాన్ జట్టు, ఫైనల్‌కి వచ్చిందంటే కారణం బౌలర్లే. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో స్లోగా బ్యాటింగ్ చేశారు...

Image credit: Getty

వారి స్ట్రైయిక్ రేటు చాలా తక్కువగా ఉంది. అయితే మెల్‌బోర్న్ వికెట్ అలా ఉండదు. ఈసారి ఈ ఇద్దరూ రాణిస్తే పాకిస్తాన్ రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు... వరల్డ్ కప్ గెలవడానికి కావాల్సిన అన్ని అర్హతలు పాక్‌కి ఉన్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్...

Pakistan-England

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 15 బ్యాటర్లలో పాకిస్తాన్ నుంచి ఒక్క ప్లేయర్ కూడా లేకపోవడం విశేషం. అయినా పాకిస్తాన్ ఫైనల్‌కి వచ్చిందంటే కారణం నెదర్లాండ్స్, సౌతాఫ్రికాపై గెలవడంతో దక్కిన అదృష్టమే. షోయబ్ అక్తర్ దీన్ని మరిచిపోయి మాట్లాడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్... 

Latest Videos

click me!