యజ్వేంద్ర చాహాల్‌ని హానీమూన్ ట్రిప్ కోసం తీసుకెళ్లారా... టీ20 వరల్డ్ కప్ 2022లో ఒక్క మ్యాచ్ కూడా...

First Published Nov 11, 2022, 10:04 AM IST

నాలుగేళ్లుగా టీమిండియాకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు యజ్వేంద్ర చాహాల్. అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చాహాల్‌కి చోటు దక్కలేదు. 2022 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీలో చాహాల్‌కి చోటు దక్కినా, ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో ప్లేస్ ఇవ్వలేదు...

Image credit: PTI

ఆసియా కప్ 2022 టోర్నీలో రవీంద్ర జడేజా గాయపడడంతో అతని స్థానంలో ఓ స్పిన్ ఆల్‌రౌండర్‌ని ఆడించాలని భావించింది టీమిండియా మేనేజ్‌మెంట్. అందుకే అక్షర్ పటేల్‌కి లక్కీగా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కింది...

అయితే అక్షర్ పటేల్ ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో బ్యాటింగ్‌కి వచ్చింది తక్కువ, వచ్చిన మ్యాచుల్లో బ్యాటుతో మెరుపులు మెరిపించింది చాలా తక్కువ.అయినా అతనినే సెమీ పైనల్ మ్యాచ్‌లోనూ కొనసాగించింది భారత జట్టు...

Image credit: PTI

అక్షర్ పటేల్‌, రవిచంద్రన్ అశ్విన్‌లతో పోలిస్తే...యజ్వేంద్ర చాహాల్ బ్యాటుతో ఫోర్లు, సిక్సర్లు బాదలేడు. కేవలం ఈ కారణంగానే అతన్ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతూ వచ్చింది టీమిండియా. మ్యాచులు గెలవాలంటే ఆల్‌రౌండర్లు అవసరమే..

Image credit: PTI

అయితే మ్యాచ్‌లు గెలిపించలేని ఆల్‌రౌండర్ల కంటే మ్యాచ్ విన్నర్లైన బౌలర్లు చాలా మేలు. ఈ విషయాన్ని రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ అండ్ కో గ్రహించలేకపోయారు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు వానిందు హసరంగ...

Yuzvendra Chahal

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ అతనే అత్యధిక వికెట్లు తీశాడు. హసరంగ కంటే యజ్వేంద్ర చాహాల్ చాలా మంచి స్పిన్నర్. కీలక సమయాల్లో వికెట్లు ఎలా రాబట్టాలో చాహాల్‌కి చాలా బాగా తెలుసు. అయితే రోహిత్ శర్మ మాత్రం చాహాల్‌పై పెద్దగా నమ్మకం పెట్టలేకపోయాడు...

Chahal

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన యజ్వేంద్ర చాహాల్, వాటర్ బాయ్‌గా బౌండరీ లైన్ బయట ఫోటోలకు ఫోజులు ఇస్తూ... భార్య ధనశ్రీ వర్మతో కలిసి బీచుల్లో షికార్లు చేస్తూ గడిపేశాడు. చూస్తుంటే చాహాల్‌ని హానీమూన్‌కి తీసుకెళ్లడానికే అతన్ని ఎంపిక చేసినట్టు అనిపిస్తోంది...

Yuzvendra Chahal

రిషబ్ పంత్ లాంటి ప్లేయర్‌ని నాలుగు మ్యాచుల్లో కూర్చోబెట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్, యజ్వేంద్ర చాహాల్‌ వంటి మ్యాచ్ విన్నర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి చాలా తప్పు చేసింది. 2021 వరల్డ్ కప్ అనుభవాన్ని చూసిన తర్వాత కూడా చాహాల్‌ని ఎందుకు ఆడించలేదో అభిమానులకు అంతుపట్టడం లేదు... 

click me!