హార్ధిక్ పాండ్యా కోసం వికెట్ త్యాగం చేసిన రిషబ్ పంత్... జోకర్‌ని చేశారంటున్న ఫ్యాన్స్...

First Published | Nov 10, 2022, 4:12 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రిషబ్ పంత్‌కి రావాల్సినన్ని అవకాశాలు రాలేదు. మొదటి నాలుగు మ్యాచుల్లో సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ని ఆడించిన టీమిండియా మేనేజ్‌మెంట్, జింబాబ్వేతో జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో మాత్రమే రిషబ్ పంత్‌కి అవకాశం ఇచ్చింది...

Image credit: Getty

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతులు ఆడిన రిషబ్ పంత్, 3 పరుగులు చేసి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. టెస్టులు, వన్డేల్లో మాత్రం టీమిండియాకి కీ ప్లేయర్‌గా మారిన రిషబ్ పంత్‌, కొంతకాలంగా టీ20ల్లో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...

Image credit: Getty

ఈ పర్ఫామెన్స్ కారణంగానో ఏమో కానీ హార్ధిక్ పాండ్యా, ఆఖరి 3 బంతుల్లో స్ట్రైయిక్ పొందేందుకు రిషబ్ పంత్‌ని రనౌట్ చేశాడు. 18వ ఓవర్ ఆఖరి బంతికి విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే ఫోర్ బాదాడు..


Rishabh Pant and Hardik Pandya

ఆ తర్వాతి బంతికి సింగిల్ తీసి హార్ధిక్ పాండ్యాకి స్ట్రైయిక్ ఇచ్చాడు రిషబ్ పంత్. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఆఖరి 3 బంతుల్లో 4, 6, 4 బాదాడు హార్ధిక్ పాండ్యా. ఆఖరి ఓవర్ తొలి బంతకి రిషబ్ పంత్ సింగిల్ తీసి పాండ్యాకి స్ట్రైయిక్ ఇవ్వగా రెండో బంతికి మరో సింగిల్ వచ్చింది...

Image credit: Getty

మూడో బంతిని రిషబ్ పంత్ మిస్ అవ్వడం, అయినా పట్టించుకోకుండా హార్ధిక్ పాండ్యా స్ట్రైయిక్ కోసం పరుగెత్తడం జరిగిపోయాయి. తాను అవుట్ అవుతానని తెలిసినా రిషబ్ పంత్... హాఫ్ క్రీజు దాటి వచ్చి నిరాశగా పెవిలియన్ చేరాడు...

జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ వంటి టాప్ క్లాస్ ఇంగ్లాండ్ బౌలర్ల బౌలింగ్‌లోనే క్రేజీ సిక్సర్లు కొట్టిన రిషబ్ పంత్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టలేడా? అనేది అభిమానుల ఆవేదన. హార్ధిక్ పాండ్యా ఫుల్లు ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి అతను స్ట్రైయిక్ కావాలని కోరుకోవడంలో తప్పులేదు...

Image credit: PTI

అయితే రిషబ్ పంత్ సత్తా గురించి తెలిసి కూడా అతన్ని ఇలా జోకర్‌లా అవుట్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు ఫ్యాన్స్. రిషబ్ పంత్ ప్లేస్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఉండి ఉంటే హార్ధిక్ పాండ్యా ఇలా చేసేవాడా? పాండ్యా ముందుకు వచ్చినా అతని కోసం ధోనీ వికెట్ త్యాగం చేసేవాడా? అని ప్రశ్నిస్తున్నారు...

హార్ధిక్ పాండ్యా కోసం వికెట్ త్యాగం చేసిన రిషబ్ పంత్, పెవిలియన్‌కి వెళుతూ థమ్సప్ చూపించడం కెమెరాల్లో రికార్డైంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇలాగే అవుట్ అయ్యాడు దినేశ్ కార్తీక్. అయితే రనౌట్ అయిన తర్వాత కోహ్లీపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ కంటే తన వికెట్ ఎక్కువ కాదనే పాజిటివ్ థింకింగ్ చూపించిన రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది... 

Latest Videos

click me!