నాలో ఫ్రస్టేషన్ పెరిగిపోతోంది... టీ20 వరల్డ్ కప్ సెమీస్ ఓటమిపై కేన్ విలియంసన్...

First Published Nov 10, 2022, 1:22 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజీలో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చిన న్యూజిలాండ్ జట్టు, సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడింది. జింబాబ్వేపై 130 టార్గెట్‌ని ఛేదించలేక చిత్తుగా ఓడిన పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని... ఫైనల్‌కి దూసుకెళ్లింది. ఈ పరాజయంపై ఆసక్తికర కామెంట్లు చేశాడు కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్...

Kane Williamson

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2015, 2019తో పాటు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీల్లో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు... 2022 పొట్టి ప్రపంచకప్‌లో సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. మూడు సార్లు వరల్డ్ కప్ ఫైనల్ చేరినా ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది న్యూజిలాండ్...

Kane Williamson

‘ప్రతీ గేమ్‌లో గెలుపు, ఓటములు సహజం. అయితే బెస్ట్ క్రికెట్ ఆడి ఓడిపోతే, కాస్త తృప్తి మిగులుతుంది. పోరాడి ఓడితే దాన్ని అంగీకరించాల్సిందే. కానీ ఈ రోజు మేం అలా ఆడలేకపోయాం. ప్రతీ విభాగంలోనూ ఫెయిల్ అయ్యాం. ఇది నాలో ఫ్రస్టేషన్‌ని పెంచేసింది...

Rohit Sharma-Kane Williamson

పాక్‌తో మ్యాచ్‌లో ఓడిన విధానం చాలా నిరుత్సాహపరిచింది. 150+ టార్గెట్ చేసిన తర్వాత దాన్ని కాపాడుకోగలమనే అనుకున్నాం. అయితే టీ20 ఫార్మాట్‌లో ఏ స్కోరు కూడా సేఫ్ కాదు. ఈ రోజు పాకిస్తాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది...

మేం చాలా ఫైనల్స్ ఆడాం. కొన్నింట్లో మంచి పర్ఫామెన్స్‌లు ఇచ్చినా గెలవలేకపోయాం. చివరి మెట్టు దాకా వస్తున్నా టైటిల్ గెలవడానికి కావాల్సిందేదో మాలో మిస్ అవుతోంది. అందుకే ఫ్రస్టేషన్‌కి గురయ్యాను...

ప్రతీ మ్యాచ్‌లో నూటికి నూరు శాతం కష్టపడుతున్నాం. ఎన్నో టోర్నమెంట్లు ఆడుతున్నాం. వాటిల్లో కొన్ని గెలుస్తున్నాం, కొన్ని గెలవలేకపోతున్నాం. అయితే అయిపోయిన దాంట్లో తప్పులను తెలుసుకుని, తర్వాతి టోర్నీపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఓడిపోయామని బాధపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్లలేం... 

pakistan

పాకిస్తాన్ మాపై ప్రెషర్ పెట్టడంలో సక్సెస్ అయ్యింది. పవర్ ప్లేలో వికెట్లు తీసి మమ్మల్ని ఒత్తిడిలో పడేశారు. ఆ తర్వాత పవర్ ప్లేలో వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసి పైచేయి సాధించారు. అక్కడే మా లెక్క తప్పింది....’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్... 

click me!