సెమీ ఫైనల్‌లోనూ ఫెయిలైన కెఎల్ రాహుల్... పసికూనలపై ప్రతాపం చూపిస్తావా అంటూ...

First Published | Nov 10, 2022, 2:08 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ నిరాశపరిచాడు. బంగ్లాదేశ్, జింబాబ్వేలపై వరుసగా హాఫ్ సెంచరీలు బాదిన కెఎల్ రాహుల్, ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి నిరాశపరిచాడు...

Image credit: Getty

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్... పాకిస్తాన్‌తో, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో ఫెయిల్ అయిన కెఎల్ రాహుల్... ఆఫ్ఘాన్, నమీబియా, స్కాట్లాండ్‌ వంటి పసి కూనలతో జరిగిన మ్యాచుల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు...

KL Rahul

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కెఎల్ రాహుల్... టీమిండియాకి కీ బ్యాటర్ అవుతాడని అంచనా వేశారు మాజీ క్రికెటర్లు... అయితే కెఎల్ రాహుల్ నుంచి రావాల్సిన పర్ఫామెన్స్ అయితే ఇప్పటిదాకా రాలేదు. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికాలతో జరిగిన మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు కెఎల్ రాహుల్...


KL Rahul

ఒకానొక దశలో కెఎల్ రాహుల్ ప్లేస్‌లో రిషబ్ పంత్‌ని ఆడించాలని టాక్ వినబడింది. అయితే బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీ చేసిన కెఎల్ రాహుల్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ బాదాడు. అయితే సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్...

పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌ వంటి టాప్ టీమ్స్‌తో జరిగిన మ్యాచుల్లో (టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో) కెఎల్ రాహుల్ సగటు 7.8 మాత్రమే. మొత్తంగా ఈ దేశాలపై టీ20 వరల్డ్ కప్‌లో 51 బంతులు ఆడిన కెఎల్ రాహుల్, 39 పరుగులు మాత్రమే చేశాడు...

Image credit: PTI

నెదర్లాండ్స్, జింబాబ్వే, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఆఫ్ఘాన్, నమీబియా వంటి చిన్న జట్లపై 155 స్ట్రైయిక్ రేటుతో 283 పరుగులు చేశాడు కెఎల్ రాహుల్. ఇందులో నెదర్లాండ్స్‌పై 12 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు రాహుల్...

Image credit: PTI

కీలక మ్యాచుల్లో తీవ్రంగా నిరాశపరిచే కెఎల్ రాహుల్ కంటే ఐసీసీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన ఇస్తూ ‘మిస్టస్ ఐసీసీ టోర్నమెంట్స్’గా పేరు తెచ్చుకున్న శిఖర్ ధావన్‌కి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

KL Rahul

దేశవాళీ టోర్నీల్లో అదరగొడుతున్న పృథ్వీ షా వంటి ప్లేయర్‌ని ఒక్క మ్యాచ్‌లో ఫెయిల్ అయ్యాడని పక్కనబెట్టేసిన టీమిండియా మేనేజ్‌మెంట్... వరుసగా ఫెయిల్ అవుతున్న కెఎల్ రాహుల్‌కి ఇలా ఇన్ని అవకాశాలు ఇవ్వడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు టీమిండియా ఫ్యాన్స్... 

Latest Videos

click me!