టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా... ఇండియా- పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ పెట్టేందుకే...

First Published | Nov 6, 2022, 11:20 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఊహకందని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. టోర్నీ మొట్టమొదటి మ్యాచ్ దగ్గర్నుంచి సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. గ్రూప్ 1లో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఆస్ట్రేలియా, గ్రూప్ స్టేజీకే పరిమితం కాగా వార్ వన్‌సైడ్ అవుతుందని అనుకున్న గ్రూప్ 2లో అంతకుమించిన హై డ్రామా నడుస్తోంది...

మొదటి మ్యాచ్‌లో టీమిండియా చేతుల్లో ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్, ఆ తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వే చేతుల్లో ఊహించని పరాజయాన్ని చవిచూసింది. జింబాబ్వే చేతుల్లో ఓడిన తర్వాత పాకిస్తాన్ సెమీస్ రేసులో నిలుస్తుందని ఆ జట్టు ఫ్యాన్స్ కూడా ఊహించి ఉండరు...

PAK vs SA

టీమిండియాపై ఘన విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా... టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరుతుందని భావించారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే స్క్రిప్టులో లేని విధంగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది టీ20 వరల్డ్ కప్. భారత జట్టుపై తేలిగ్గా విజయాన్ని అందుకున్న సౌతాఫ్రికా... పాక్ చేతుల్లో ఘోరంగా ఓడింది.


అయినా చివరి మ్యాచ్ పసికూన నెదర్లాండ్స్‌తో కావడంతో సఫారీ జట్టు సెమీస్ చేరడం ఖాయమనుకున్నారంతా. అయితే నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 159 పరుగుల టార్గెట్‌ని ఛేదించలేక 13 పరుగుల తేడాతో ఓడింది సౌతాఫ్రికా. ఈ పరాజయం మాత్రం ఎవ్వరూ ఊహించనది...

NED vs SA

సౌతాఫ్రికా ఓటమితో అన్యూహ్యాంగా మళ్లీ సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది పాకిస్తాన్. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గెలిస్తే చాలు, పాక్ టాప్ 2లో నిలిచి సెమీ ఫైనల్ చేరుకుంటుంది. దీంతో సౌతాఫ్రికా- నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్...

pakistan

భారత్- బంగ్లా మ్యాచ్‌పై పాక్ క్రికెట్ ఫ్యాన్స్ రకరకాలు ఆరోపణలు చేశారు. ఐసీసీ అడ్డం పెట్టుకుని, టీమిండియా గెలిచిందని కామెంట్లు చేశారు. దీంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఇలా చెత్తగా ఆడి ఉంటుందని ఆరోపిస్తున్నారు కొందరు భారత క్రికెట్ ఫ్యాన్స్...

మరికొందరు ఈ మ్యాచ్‌లో కూడా మార్కెటింగ్ కోణాలను వెతుకుతున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ అటు బ్రాడ్‌ కాస్టర్లకు, ఇటు ఆతిథ్య ఆస్ట్రేలియాకి, ఐసీసీకి కాసుల పంట కురిపించింది. గ్రూప్ మ్యాచ్‌కే ఈ లెవెల్ క్రేజ్ వస్తే ఇండియా- పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరిగితే...

15 ఏళ్ల తర్వాత ఇండియా - పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ రికార్డులన్నీ తిరగరాసి, మడతపెట్టేయం ఖాయం. అందుకే అన్యూహ్యంగా సౌతాఫ్రికాని ఓడించి.. పాక్‌ని సెమీస్ రేసులో నిలిపిన ఐసీసీ... దాయాదుల మధ్య ఫైనల్ పెట్టి కోట్ల ఆదాయం దక్కించుకోవాలని చూస్తోందని ఓ వార్త... సోషల్ మీడయాలో తెగ వైరల్ అవుతోంది.. 

Latest Videos

click me!