టీ20 వరల్డ్ కప్‌లో హిస్టరీ రిపీట్... టీమిండియా నుంచి ఆస్ట్రేలియా వరకూ అదే సీన్...

First Published | Nov 5, 2022, 5:59 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ 1 మ్యాచులు ముగిశాయి. గ్రూప్ 2లో సెమీస్ బెర్త్‌ల కోసం సూపర్ 12 రౌండ్‌లో ఆఖరి రోజు మ్యాచులు దాకా వేచి చూడాల్సిందే. టైటిల్ ఫెవరెట్‌గా 2022 టోర్నీని ఆరంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా... నెట్ రన్ రేట్ కారణంగా గ్రూప్ స్టేజీ నుంచి నిష్కమించింది...

ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో నెట్ రన్‌ రేట్ తక్కువగా ఉన్న కారణంగా ఆస్ట్రేలియా సెమీస్ చేరలేకపోవడం ఇదే మొట్టమొదటిసారి. 2021 టీ20 వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికా కంటే మెరుగైన రన్‌రేట్ ఉండడం వల్లే సెమీస్ చేరిన ఆస్ట్రేలియా... మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్ గెలిచింది...

australia

టీ20 వరల్డ్ కప్‌ టైటిల్ గెలిచిన ఏ జట్టూ కూడా ఆ తర్వాతి ఏడాది ఫైనల్ చేరలేకపోయింది. 2007లో మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ నుంచి ఇదే సీన్ రిపీట్ అవుతూ వస్తోంది. ఈసారి ఆస్ట్రేలియా దీన్ని బ్రేక్ చేస్తుందని అందరూ భావించినా... అది సాధ్యం కాలేదు...

Latest Videos


2007 ఇండియా, పాకిస్తాన్‌ని ఓడించి మొట్టమొదటి వరల్డ్ కప్ గెలిచింది. 2009లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా, సెమీ ఫైనల్ కూడా చేరలేకపోయింది. గ్రూప్ స్టేజీలో జరిగిన మూడుకి మూడు మ్యాచుల్లో ఓడింది టీమిండియా...

2009లో శ్రీలంకని ఓడించి వరల్డ్ కప్ గెలిచింది పాకిస్తాన్. 2010 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ సెమీస్ చేరినా, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టింది. 2010 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాని ఓడించి, ఛాంపియన్‌గా నిలిచింది ఇంగ్లాండ్...

england

2012 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ సెమీ ఫైనల్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ 1లో 3 మ్యాచులు ఆడిన ఇంగ్లాండ్ జట్టు, ఒకే విజయం అందుకుని రెండు పరాజయాలతో మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. 2012 ఫైనల్‌లో శ్రీలంకను 36 పరుగుల తేడాతో చిత్తు చేసిన వెస్టిండీస్... వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచింది...

2014 టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ సెమీ ఫైనల్‌కి వచ్చింది. అయితే శ్రీలంక చేతుల్లో 27 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్, ఫైనల్ చేరలేకపోయింది. ఫైనల్‌లో టీమిండియాని ఓడించిన శ్రీలంక... మొట్టమొదటి వరల్డ్ కప్ సొంతం చేసుకుంది...

Image credit: Getty

2016 టీ20 వరల్డ్ కప్‌లో శ్రీలంక జట్టు సెమీస్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ 1లో పోటీపడిన లంక 4 మ్యాచుల్లో ఒకే విజయం అందుకుని, 3 మ్యాచుల్లో ఓడింది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించిన వెస్టిండీస్, రికార్డు స్థాయిలో రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ని సొంతం చేసుకుంది...

2021 టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ కూడా సెమీ ఫైనల్ చేరకుండానే గ్రూప్ దశ నుంచే నిష్కమించింది. 2021 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ని ఓడించిన ఆస్ట్రేలియా... మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా కూడా మిగిలిన జట్ల ఆనవాయితీని ఫాలో అవుతూ ఫైనల్ చేరలేకపోయింది... 

click me!