ఇప్పటికీ వాళ్లు నన్ను మ్యాచ్ ఫిక్సర్‌గానే చూస్తున్నారు... మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆవేదన..

First Published | Nov 5, 2022, 4:08 PM IST

పాకిస్తాన్ క్రికెట్‌ని మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలు కుదిపేసినట్టుగా మరో జట్టును ఇబ్బంది పెట్టలేదనుకుంటా! ఇప్పటికీ డజనుకు పైగా పాక్ ప్లేయర్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని, నిషేధానికి గురయ్యాడు. పాక్ మాజీ కెప్టెన్,  లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్‌పైన కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి...

పాకిస్తాన్ తరుపున 104 టెస్టు మ్యాచులు ఆడి 414 వికెట్లు తీసిన వసీం అక్రమ్, 356 వన్డేల్లో 502 వికెట్లు తీశాడు. పాక్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన వసీం అక్రమ్, 1992 వరల్డ్ కప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’గా నిలిచాడు...

ఇమ్రాన్ ఖాన్ తర్వాత పాక్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న వసీం అక్రమ్, 1996 వరల్డ్ కప్, 1999 వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్ టీమ్‌ని నడిపించాడు. వసీం అక్రమ్ కెప్టెన్సీలో 1996లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిన పాక్, 1999 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయింది...

Latest Videos


1996లో పాక్ మాజీ పేసర్ అతర్ వుర్ రహీమ్, న్యూజిలాండ్‌తో జరిగిన 1993-94 వన్డే సిరీస్‌లో చెత్తగా బౌలింగ్ వేసేందుకు వసీం అక్రమ్ రూ.3-4 లక్షలు ఇస్తానని ఆశచూపాడని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి..

1996లో టీమిండియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో వసీం అక్రమ్ కావాలని ఆడలేదని, అప్పుడు ఫేక్ గాయం వంకతో తప్పుకున్నాడని కూడా పాక్ క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపణలు చేశారు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి మొబైల్ ఫోన్ తీసుకొచ్చి కావాలని పాక్ ఓటమికి కారణమయ్యాడని విమర్శలు వచ్చాయి.

wasim akram 1992 world cup

‘వసీం అక్రమ్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లలో ఒకడిగా అందరికీ తెలుసు. ఇంగ్లాండ్‌లో నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్తాన్‌లో మాత్రం ‘‘అతను ఓ మ్యాచ్ ఫిక్సర్’’ అని అనుకుంటారు. ఇది నాకు ఎంతో బాధని కలిగిస్తుంది...

wasim akram 1992 world cup

ఇలాంటి మాటలు విన్నప్పుడు షాక్ అవుతా... గుండెబద్ధలైపోయినట్టు అనిపిస్తుంది. అసలు ఎలా? నాకే నమ్మకం కలగడం లేదు. నాకు తెలియకుండా నేను ఓ ఊబిలో ఎలా ఇరుక్కుపోయా. అది చాలా కఠినమైన సమయం. ఎవ్వరిపైన ఎవ్వరికీ నమ్మకం ఉండేది కాదు...

స్నేహితుడని నమ్మినవాళ్లే నన్ను నిలువునా ముంచారు. ఇమ్రాన్ ఖాన్, జావెద్ మియాందాద్ రిటైర్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌ని కంట్రోల్ చేసేవాళ్లు కరువయ్యారు. ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉండేవాళ్లు. వీరిని ఎలా దారిలోకి తీవాలో నాకు అర్థమయ్యేది కాదు...

నాపైన ఇలాంటి ఆరోపణలు చేసినవాళ్లతో నేను మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. వాళ్లకి చాలామంది సపోర్ట్ ఉండేది. క్రికెట్ బోర్డు, మేనేజర్లు, కోచ్‌లు వారినే సహకరించేవాళ్లు. ఆ విషయాన్ని మరిచిపోవడానికి చాలా సమయమే పట్టింది. వారిపై రివెంజ్ తీర్చుకోవడానికి నా దగ్గర అంత సమయం లేదు...’ అంటూ తన ఆటోబయోగ్రఫీ ‘సుల్తాన్: ఏ మెమోయర్’ లో రాసుకొచ్చాడు వసీం అక్రమ్.. 

click me!