మనిషివా, రాహుల్‌వా... మరీ జింబాబ్వేపైన కూడా మెయిడిన్ ఓవర్ ఆడితే ఎలా... ఆగని ట్రోల్స్!

First Published | Nov 6, 2022, 2:18 PM IST

నితిన్, నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా వచ్చిన ‘ఇష్క్’ మూవీలో ఓ డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. హీరో తన పేరు రాహుల్ అని పరిచయం చేసుకుంటే... ‘నువ్వు మనిషివా రాహుల్‌వా... ’ అంటూ వేరే లెవెల్‌లో ట్రోల్ చేస్తుంది నిత్యామీనన్. ఇప్పుడు భారత క్రికెటర్, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది...

KL Rahul

మొదటి మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయిన కెఎల్ రాహుల్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. ఎన్ని మ్యాచుల్లో ఫెయిల్ అయినా కెఎల్ రాహుల్‌పై నమ్మకం పెట్టిన టీమిండియా మేనేజ్‌మెంట్, అతనికి వైస్ కెప్టెన్సీ అప్పటించి, ఫ్యూచర్ కెప్టెన్‌గా చూస్తోంది...

Image credit: Getty

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్ ఫేస్ చేసిన కెఎల్ రాహుల్, మొదటి ఆరు బంతుల్లో సింగిల్ కూడా రాబట్టలేకపోయాడు. వేన్ పార్నెల్ బౌలింగ్‌లో ఆరుకి ఆరు డాట్ బాల్స్ ఆడాడు. అయితే టాప్ క్లాస్ బౌలర్లతో నిండిన సఫారీ టీమ్‌పై మెయిడిన్ ఆడడంతో కెఎల్ రాహుల్‌పై పెద్దగా విమర్శలు రాలేదు..

Latest Videos


KL Rahul

తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ తొలి ఓవర్‌లో పరుగులేమీ చేయలేకపోయాడు కెఎల్ రాహుల్. రిచర్డ్ నగరవా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్ సింగిల్ రాబట్టడానికి కూడా తెగ ఇబ్బంది పడ్డాడు... టీమిండియాపై టీ20 వరల్డ్ కప్‌లో తొలి ఓవర్ మెయిడిన్లు వేసిన బౌలర్లుగా పార్నెల్, నగరవా రికార్డులు క్రియేట్ చేశారు.

KL Rahul

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తొలి ఓవర్‌లో ఇండియా తరుపున వచ్చింది రెండు మెయిడిన్ ఓవర్లే. అవి రెండు కూడా కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌లోనే రావడం మరో విశేషం. దీంతో రాహుల్‌ని మరోసారి ట్రోల్ చేస్తున్నారు మీమర్స్...

తొలి మూడు మ్యాచుల్లో పరుగులు చేయడంలో విఫలమైన కెఎల్ రాహుల్, క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకుంటున్నాడు. వికెట్ కాపాడుకోవాలనే ఆలోచన మంచిదే కానీ తొలి ఓవర్‌నే మెయిడిన్‌గా మారిస్తే... నాన్‌స్ట్రైయికింగ్‌ ఎండ్‌లో ఉండే బ్యాటర్ రోహిత్ శర్మపై ఒత్తిడి పడుతుంది. రోహిత్ శర్మ, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పెద్దగా రాణించకపోవడానికి కెఎల్ రాహుల్ బ్యాటింగ్ కూడా ఓ కారణం...

వికెట్ కాపాడుకోవాలంటే మెయిడిన్ ఆడాల్సిన అవసరం లేదు. సింగిల్ తీసి స్ట్రైయిక్ రొటేట్ చేసినా సరిపోతుంది. మరీ ఒక్క సింగిల్ కూడా తీయలేనంత ప్రెషర్‌ని కెఎల్ రాహుల్ ఫేస్ చేస్తున్నాడా? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు లేవనెత్తింది..

click me!