ఇది ఛీటింగ్ కాదా? మరి దీన్నేమంటారు.. టీమిండియాతో మ్యాచ్‌‌లో ఇలా జరిగి ఉంటేనా...

First Published | Nov 6, 2022, 1:32 PM IST

భారత దాయాదులు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చాలా విషయాల్లో పోలికలు ఉంటాయి. ముఖ్యంగా  భారత క్రికెట్ బోర్డుపై అక్కసు వెళ్లగక్కడంలో ఈ రెండు జట్ల తరువాతే ఎవ్వరైనా! టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ - బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ మొదటి 10 ఓవర్లలో 72 పరుగులు చేసింది. టీమిండియాపై మెరుపు హాఫ్ సెంచరీ చేసిన లిట్టన్ దాస్ 10 పరుగులకే అవుటైనా సౌమ్య సర్కార్, షాంటో కలిసి రెండో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

Shakib Al Hassan

అయితే 20 పరుగులు చేసిన సౌమ్య సర్కార్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అయితే అంపైర్ అవుట్ ఇవ్వగానే షకీబ్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో బంతి, బ్యాటు ఎడ్జ్‌ని తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది.

Latest Videos


Litton Das

అయితే థర్డ్ అంపైర్ మాత్రం ఆ స్పైక్, బంతి నేలను తాకుతున్నందుకు వచ్చినవిగా నిర్ణయించి, షకీబ్ అల్ హసన్‌ని అవుట్‌గా ప్రకటించాడు. వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లా చివరి 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 52 పరుగులు మాత్రమే చేయగలిగింది...

అయితే షకీబ్ అల్ హసన్ అవుట్ విషయంలో పాకిస్తాన్‌పై ఎలాంటి ఛీటింగ్ ఆరోపణలు రాలేదు. ఇదే ఇండియా- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ విషయంలో ఇలాంటి ఆరోపణలు చేశాడు బంగ్లా ఫ్యాన్స్, క్రికెటర్ నురుల్ హసన్. వర్షం తర్వాత అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారుతుంది. ఇది బ్యాటింగ్ టీమ్‌కే అడ్వాంటేజ్...

shakib al hasan hugs virat kohli

అయితే డీఎల్‌ఎస్ విధానం ప్రకారం మ్యాచ్ ఆగిపోతే టీమిండియా ఓడిపోయేది. అందుకే వర్షం ఆగిన వెంటనే మ్యాచ్ పెట్టేలా అంపైర్లను టీమిండియా ఒత్తిడి చేసిందని ఆరోపణలు వచ్చాయి. అలాగే విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వల్ల రావాల్సిన 5 పెనాల్టీ పరుగులు రాలేదని నురుల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు... పెను దుమారం రేపాయి...

విరాట్ కోహ్లీ అడిగిన వెంటనే అంపైర్లు నో బాల్ ఇస్తున్నాడని, వైడ్ బాల్ ప్రకటిస్తున్నారని ఐసీసీ, బీసీసీఐ ఫెవర్‌గా మ్యాచులను నిర్వహిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి పాక్, బంగ్లా క్రికెట్ ఫ్యాన్స్.. 

bangladesh

భారత జట్టుతో జరిగే మ్యాచ్‌లో జరిగే తప్పిదాలను బీసీసీఐ చేయించిందని ఆరోపణలు చేసి... ‘ఛీటర్స్’ అంటూ ట్రెండ్ చేసిన పాక్, బంగ్లా అభిమానులు... ఇప్పుడు ఎందుకని అలాంటివి చేయడం లేదని పోస్టులు పెడుతున్నారు టీమిండియా ఫ్యాన్స్... ఇదే తప్పు, టీమిండియా ఆడే మ్యాచ్‌లో జరిగి ఉంటే ఈపాటికి సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ చేసేవాళ్లని అంటున్నారు. 

click me!