విరాట్ కోహ్లీ ప్లేస్‌లో బాబర్ ఆజమ్ ఉండి ఉంటేనా... పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కామెంట్స్..

First Published | Oct 27, 2022, 10:19 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు కిక్కు ఇచ్చింది. నరాలు తెగేంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ టీ20ల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి, భారత జట్టుకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు...

virat kohli

31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం జోడించిన విరాట్ కోహ్లీ... 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

Babar Azam

‘విరాట్ కోహ్లీ ప్లేస్‌లో మరే బ్యాటర్ ఉన్నా, మ్యాచ్ ఇక్కడిదాకా వచ్చేది కాదు. నిజం చెప్పాలంటే విరాట్ కోహ్లీ ప్లేస్‌లో బాబర్ ఆజమ్ కానీ, మహ్మద్ రిజ్వాన్ కానీ ఉండి ఉంటే.. పాకిస్తాన్ కనీసం 30-40 పరుగుల తేడాతో ఓడిపోయి ఉండేది...


కారణం మేం అంత ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేం. పాకిస్తాన్‌లో అండర్ 15, అండర్ 19 ఆడుతున్న కుర్రాళ్లందరికీ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ని చూపించాలి. ఇన్నింగ్స్‌ని ఎలా నిర్మించాలి, మ్యాచ్‌ని ఎలా గెలిపించాలనే పాఠాన్ని, విరాట్ ఈ ఇన్నింగ్స్‌తో నేర్పించాడు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్...

బాబర్ ఆజమ్, పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్, మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కి మేనల్లుడు. అక్మల్ బ్రదర్స్ తోడ్పాటుతో క్రికెటర్‌గా ఎదిగిన బాబర్ ఆజమ్, పాక్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే తన కెరీర్ ఆరంభంలో ఎవ్వరూ సాయం చేయలేదని బాబర్ ఆజమ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...

టీమిండియా చేతుల్లో 4 వికెట్ల తేడాతో ఓడిన పాకిస్తాన్, తర్వాతి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలబడుతోంది. జింబాబ్వేపై బాబర్ ఆజమ్‌కి తిరుగులేని రికార్డు ఉంది. జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి జట్లపై సెంచరీలతో చెలరేగి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లాడు బాబర్ ఆజమ్. దీంతో జింబాబ్వే- పాక్ మ్యాచ్‌ని ‘గ్రేటెస్ట్ రివల్టీ’ పేరుతో ట్రోల్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్..

KL Rahul

పాక్‌తో మ్యాచ్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్, నెదర్లాండ్స్‌పై సెంచరీ చేయబోతున్నాడని... భారత వైస్ కెప్టెన్‌ని కూడా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు..

Latest Videos

click me!