ఈ ఏడాది నా టార్గెట్ అదే! ఒకే ఒక్క క్యాచ్ పట్టుకుంటే చాలు... హార్ధిక్ పాండ్యా కామెంట్...

First Published | Oct 18, 2022, 1:25 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్‌తో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేని హార్ధిక్ పాండ్యాని కేవలం మెంటర్ ఎంఎస్ ధోనీ రికమెండేషన్‌తో వరల్డ్ కప్ ఆడించారని విమర్శలు వచ్చాయి. అయితే రీఎంట్రీ తర్వాత పాండ్యా ఆటతీరు పూర్తిగా మారిపోయింది...

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత నాలుగు నెలలు టీమిండియాకి దూరంగా ఉన్న హార్ధిక్ పాండ్యా, పూర్తి ఫిట్‌నెస్ సాధించి... ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడాడు. కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిల్ నెగ్గిన హార్ధిక్ పాండ్యా, అటు బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ మునుపటి మెరుపులు చూపించాడు...

Image credit: PTI

‘దేవుడి దయ వల్ల నేను మళ్లీ పూర్తి ఫిట్‌నెస్ సాధించగలిగా. టీమ్ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌తో కలిసి చాలా సమయం ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ముందు నుంచే ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉండాలని భావించే ప్లేయర్‌ని. అసాధారణ క్యాచులు అందుకోవాలనే ఆత్రం నాలో ఉంటుంది...


ఇప్పుడు నా స్కిల్స్‌కి పరీక్ష పెట్టేందుకు కావాల్సినంత సమయం దొరికింది. కష్టమైన క్యాచులు అందుకునేందుకు ప్రాక్టీస్ చేస్తున్నా. హార్ధిక్ పాండ్యా ఫీల్డ్‌లో ఎలా ఉంటాడో అందరికీ తెలుసు, ఎలా బంతిని ఆపుతాడో కూడా తెలుసు...

Hardik Pandya

ఈ ఏడాది ఓ క్యాచ్ అందుకోవడమే నా లక్ష్యం. అంటే అది నా కెరీర్‌లో బెస్ట్ క్యాచ్‌గా మారాలి. నేను ఎన్ని పరుగులు చేశాననేది ముఖ్యం, ఎలా ఆడాననేదే అవసరం. పరిస్థితికి అనుగుణంగా నన్ను నేను మలుచుకోవడానికి సిద్ధంగా ఉంటాను. మిడిల్ ఆర్డర్‌లో 21 బంతులు సరిగ్గా ఆడితే చాలు...

Image credit: Getty

నాకు ప్రాక్టీస్ గేమ్‌లో ఎలా ఆడాలో తెలుసు, అసలు మ్యాచుల్లో ఎలా ఆడాలో బాగా తెలుసు. ఆస్ట్రేలియా పరిస్థితులకు త్వరగా అలవాటు పడడం చాలా అవసరం. ఫాస్ట్ బౌలర్‌గా ఇక్కడి పిచ్‌, పరిస్థితులపై పూర్తి అవగాహన చేసుకుంటున్నా...’ అంటూ బీసీసీఐ పోస్టు చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా... 

Latest Videos

click me!