టీమిండియాకి ఆ విషయంలో ఇంకా రాని క్లారిటీ... రోహిత్ శర్మ చెప్పనైతే చెప్పాడు కానీ...

First Published | Oct 18, 2022, 12:20 PM IST

టీమిండియా సారథిగా రోహిత్ శర్మ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా గత ఏడాది కాలంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో అనేక మార్పులు జరిగాయి. బ్యాటింగ్ ఆర్డర్‌లో అనేక రకాల ప్రయోగాలు చేసిన రోహిత్, ఒక సిరీస్‌లో మూడు మ్యాచుల్లో ఒకే జట్టును ఆడించిన సందర్భాలు చాలా తక్కువ... టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో మూడు ప్రాక్టీస్ మ్యాచులు ఆడింది భారత జట్టు. వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది...

Image credit: Getty

అందుకే ప్లేయింగ్ ఎలెవన్‌పై ఇంకా స్పష్టత రావడం లేదు. అశ్విన్, అక్షర్ పటేల్‌లను తుది జట్టులో చేర్చిన మేనేజ్‌మెంట్, ప్రాక్టీస్ మ్యాచ్‌ కావడంతో యజ్వేంద్ర చాహాల్‌తో కూడా 3 ఓవర్లు బౌలింగ్ వేయించింది. తుది జట్టులో లేని మహ్మద్ షమీని తీసుకొచ్చి ఆఖరి ఓవర్ బౌలింగ్ చేయించాడు రోహిత్ శర్మ...


Image credit: Getty

అసలు మ్యాచుల్లో ఇలాంటి సౌలభ్యం ఉండదు. అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీలలో ఏ ముగ్గురిని తుది జట్టులో ఆడిస్తారు? హర్షల్ పటేల్, ఆస్ట్రేలియాపై 19వ ఓవర్ వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి, ఆరోన్ ఫించ్ వికెట్ తీశాడు..

అర్ష్‌దీప్ సింగ్‌కి అనుభవం లేకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి టాప్ క్లాస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. భువీ, షమీ రూపంలో ఇద్దరు సీనియర్లను ఆడించాలని టీమిండియా భావిస్తే... అర్ష్‌దీప్ సింగ్, హర్షల్‌ పటేల్‌ల్లో ఎవరిని ఆడించాలనే విషయంపై టీమ్‌కి క్లారిటీ రావాలి...

Nagpur: Indian captain Rohit Sharma and batter Dinesh Kartik being greeted by Australian players after winning the 2nd T20 cricket match between India and Australia, at Vidarbha Cricket Association Stadium in Nagpur, Friday, Sept. 23, 2022. (PTI PhotoShashank Parade)(PTI09_23_2022_000311B)

అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్‌లో ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే తుదిజట్టులో చోటు దక్కుతుంది. ఆల్‌రౌండర్లకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే అక్షర్ పటేల్, అశ్విన్... చాహాల్ కంటే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటారు. లేదంటే ప్రధాన స్పిన్నర్‌గా చాహాల్ ఆడొచ్చు... 

Image credit: PTI

‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఏ టీమ్‌ని ఆడించాలో నేనెప్పుడో డిసైడ్ అయిపోయా... అందులో ఎలాంటి మార్పు ఉండదు’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ. మరి ఆ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది... 
 

Latest Videos

click me!