ధోనీలా ఎవ్వరూ ఐసీసీ ట్రోఫీలు గెలవలేరు... సెమీస్ ఓటమి తర్వాత మాహీని పొగిడిన గౌతమ్ గంభీర్...

First Published | Nov 11, 2022, 1:50 PM IST

మహేంద్ర సింగ్ ధోనీకి, గౌతమ్ గంభీర్‌కీ అస్సలు పడదు. మాహీ గురించి ఎవ్వరైనా పొగిడినా, గంభీర్ స్పందించే విధానం వేరేగా ఉంటుంది. మాహీ ఓరియో బిస్కెట్స్‌కి 2011 వన్డే వరల్డ్ కప్ క్రెడిట్స్ కట్టబెడితే, తన ఇంట్లో పెంపుడు కుక్క పేరు ‘ఓరియో’ అంటూ వీడియో విడుదల చేశాడు గౌతమ్ గంభీర్...

ధోనీ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలిచినా, అయితే టీమ్ అంతా ఆడడం వల్లే భారత జట్టుకి ప్రపంచ కప్ వచ్చిందని... ఆ విజయంలో అందరికీ భాగం ఉందని గుర్తించాలని డిమాండ్ చేశాడు గౌతమ్ గంభీర్.. ధోనీ వల్లే ఫైనల్ మ్యాచ్‌లో తాను సెంచరీ మిస్ అయ్యానని కూడా ఆరోపణలు చేశాడు... 

Gambhir Dhoni

తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచే ఇంటిదారి పట్టడంతో మాహీ కెప్టెన్సీని ప్రశంసల్లో ముంచెత్తాడు గౌతమ్ గంభీర్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్లు భవిష్యత్తులో రావొచ్చేమో కానీ ధోనీలాంటి కెప్టెన్ రాడని, రాలేడని షాకింగ్ కామెంట్లు చేశాడు...


‘రోహిత్ శర్మ కొట్టినట్టుగా మరో ప్లేయర్ వచ్చి డబుల్ సెంచరీలు కొట్టొచ్చు... విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ సెంచరీలు చేసే ప్లేయర్ కూడా రావచ్చు. కానీ ఎంఎస్ ధోనీ‌లా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచే భారత కెప్టెన్ మాత్రం రాకపోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

Gautam Gambhir

ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేసిన వారిలో మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా ఒకడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్ గెలిచినప్పుడు, ఒక్క టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు గంభీర్...

Rohit Sharma - Gautam Gambhir

కెప్టెన్‌గా రోహిత్ శర్మ, టీమిండియాకి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అందిస్తాడని బోలెడు నమ్మకం పెట్టుకున్నాడు గంభీర్. అయితే అతని అంచనాలను తలకిందులు చేస్తూ భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్ నుంచే నిష్కమించింది...

Latest Videos

click me!