వరల్డ్ కప్ గెలవకపోయినా, టీమిండియాని ఓడిస్తే చాలని చెప్పారు... పాక్ క్రికెటర్ షాదబ్ ఖాన్ కామెంట్స్...

First Published Nov 12, 2022, 5:00 PM IST

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన తర్వాత కూడా లక్‌ కలిసి రావడంతో సెమీ ఫైనల్‌ చేరి, ఫైనల్‌కి ప్రవేశించింది పాకిస్తాన్. 2009 తర్వాత మొట్టమొదటి సారి టీ20 వరల్డ్ కప్ చేరిన పాక్, ఈసారి కూడా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది...

Shadab Khan

పాకిస్తాన్ తరుపున 6 మ్యాచుల్లో 6.59 ఎకానమీతో 10 వికెట్లు తీసిన షాదబ్ ఖాన్, కీలక మ్యాచుల్లో బ్యాటుతో కూడా రాణించాడు. పాకిస్తాన్ తరుపున 83 టీ20 మ్యాచుల్లో 97 వికెట్లు తీసిన షాదబ్ ఖాన్, మరో 3 వికెట్లు తీసి 100 టీ20 వికెట్లు పూర్తి చేసుకుంటాడు...

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 21 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్న డేంజరస్ బ్యాటర్ డివాన్ కాన్వేని డైరెక్ట్ త్రోతో రనౌట్ చేసిన షాదబ్ ఖాన్, 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌కి టైటిల్ అందిస్తానని అంటున్నాడు షాదబ్ ఖాన్...

Shadab Khan

‘చిన్నప్పటి నుంచి మేం వరల్డ్ కప్ గెలిచా లేదా అనేదానికంటే టీమిండియాని ఓడించామా? లేదా? అనేదే పెద్ద విషయంగా చూసేవాళ్లు. వరల్డ్ కప్ గెలవకపోయినా సరే, టీమిండియాపై గెలిస్తే చాలనే మైండ్‌సెట్ ఉండేది...

ఈసారి టీమిండియా ఫైనల్‌కి రాకపోవడంతో మేం చాలా నిరాశకు గురయ్యాం. ఫైనల్‌లో టీమిండియాని ఓడించి, టైటిల్ గెలిస్తే ఆ మజా వేరేగా ఉండేది. ఇప్పుడు మాపై ఎలాంటి ప్రెషర్ లేదు. మేమే గెలవబోతున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు షాదబ్ ఖాన్...

Pakistan vs Zimbabwe

టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో షాదబ్ ఖాన్  22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ఓడిన తర్వాత ఏడుస్తూ ఓవరాక్షన్ చేసిన షాదబ్ ఖాన్, లక్కీగా ఫైనల్ చేరడంతో ఇలా ప్రగల్భాలు పలుకుతున్నాడని అంటున్నారు నెటిజన్లు.. 

click me!