ఇక్కడ పెట్టలేం, టీ20 వరల్డ్‌కప్ కూడా అక్కడే... షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ...

First Published Jun 26, 2021, 9:50 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు భారత్ వేదికగా జరగాల్సిన 2021 టీ20 వరల్డ్‌కప్‌పైన కూడా పడింది. 

షెడ్యూల్ ప్రకారం భారత్‌లో నిర్వహించాల్సిన టీ20 వరల్డ్‌కప్ కూడా తటస్థ వేదిక యూఏఈకి మారింది.
undefined
ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల కోసం యూఏఈ చేరుకుంటుంది.
undefined
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14లో మిగిలిన మ్యాచులు పూర్తి అయిన తర్వాత నేరుగా టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటారు క్రికెటర్లు...
undefined
ఐపీఎల్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ కూడా యూఏఈ వేదికగా జరుగుతుండడంతో విదేశీ ప్లేయర్లు కూడా లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
undefined
ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తుండగా, ఇంగ్లాండ్ ప్లేయర్ల రాకపై అనుమానాలున్నాయి.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్ 19న ప్రారంభించి... అక్టోబర్ 15న ముగించాలని భావిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రెండు రోజులకే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది.
undefined
అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభించి, ఫైనల్‌ మ్యాచ్‌ను నవంబర్ 14న నిర్వహించాలని ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది.
undefined
16 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో 12 జట్లు సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తారు. సూపర్ 12 రౌండ్స్ అక్టోబర్ 24 నుంచి ప్రారంభం అవుతాయి. సూపర్ 8 తర్వాత మూడు ఫ్లేఆఫ్ మ్యాచులు, రెండు సెమీ ఫైనల్స్, ఓ ఫైనల్‌తో టీ20 వరల్డ్‌కప్ ముగుస్తుంది.
undefined
బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఓమన్, పపూవ న్యూ జినోవా జట్లు సూపర్ 12లో ప్లేస్‌ కోసం పోరాడబోతున్నాయి.
undefined
అంటే షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 17న ప్రారంభమైన టీమిండియికా అక్టోబర్ 24వరకూ సమయం ఉంటుంది.
undefined
click me!