టీమిండియా గతిని మార్చిన విజయానికి 38 ఏళ్లు... 83లో అండర్‌గాడ్‌గా బరిలో దిగి...

Published : Jun 25, 2021, 05:00 PM IST

భారత జట్టు క్రికెట్ చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తే... అందులో మొదట ప్రస్తావనకి వచ్చేది 1983 వరల్డ్‌కప్ విజయం. ఓ అనామక జట్టుగా బరిలో దిగిన టీమిండియా, ఊహించని విజయాలతో ఫైనల్‌ చేరి, దుర్భేద్యమైన బౌలింగ్, విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్న వెస్టిండీస్‌ను ఓడించి, సరికొత్త చరిత్రకి ‘నాంది’ పలికింది...

PREV
110
టీమిండియా గతిని మార్చిన విజయానికి 38 ఏళ్లు... 83లో అండర్‌గాడ్‌గా బరిలో దిగి...

1983, జూన్ 25న వెస్టిండీస్‌తో టీమిండియా ఫైనల్ మ్యాచ్. అప్పటికే రెండు సార్లు వరల్డ్‌కప్‌ గెలిచి, క్రికెట్‌లో టాప్ టీమ్‌గా ఉంది విండీస్. 1975లో ఆస్ట్రేలియాను, 1979లో ఇంగ్లాండ్‌ను ఫైనల్‌లో ఓడించి, టైటిల్స్ గెలిచింది వెస్టిండీస్.

210

అలాంటి విండీస్‌ టీమ్‌ను అప్పటిదాకా పెద్దగా విజయాలు అందుకోలేకపోయిన భారత జట్టు ఓడించడం అంటే... పగటి కలే అనుకున్నారంతా. భారత జట్టు ఫైనల్ దాకా వచ్చిందంటే అదే పెద్ద అఛీవ్‌మెంట్ అనుకున్నారు.

310

టీమిండియా గెలుపుపై పెద్దగా ఎవ్వరికీ ఆశలు, అంచనాలు లేవు. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 183 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ ఉన్న విండీస్‌కి ఇది చాలా సులువైన లక్ష్యం.

410

వెస్టిండీస్ ఈజీగా ఈ లక్ష్యాన్ని చేధించి, హ్యాట్రిక్ వరల్డ్‌కప్ కొడుతుందని ఫిక్స్ అయిపోయారంతా... కానీ భారత బౌలర్లు ఊహించని విధంగా అంచనాలకు మించి అదరగొట్టారు...

510

విండీస్ లెజెండరీ బ్యాట్స్‌మెన్ సర్ గోర్డన్ గ్రీనిడ్జ్, డెస్మాండ్ హేన్స్, సర్ క్లైవ్ లార్డ్స్ సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. సర్ వీవ్ రిచర్డ్స్ 33 పరుగులు చేశాడు.

610

అయితే బల్విందర్ సంధు రెండు, మదన్ లాల్ మూడు, మోహిందర్ అమర్‌నాథ్ మూడేసి వికెట్లు తీసి విండీస్ పతనాన్నిశాసించారు. కపిల్‌దేవ్, రోజర్ బిన్నీలకు చెరో వికెట్ దక్కాయి...

710

1983లో 183 పరుగులను కాపాడుకుంటూ విండీస్‌ను 140 పరుగులకే ఆలౌట్ చేసింది భారత జట్టు. ఈ విజయమై భారత క్రికెట్ జట్టు సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. యువకుల్లో క్రికెట్‌పై ఆసక్తి పెంచేలా చేసింది...

810

అప్పటిదాకా క్రికెట్ ఆటను పట్టించుకోని వాళ్లు కూడా దాని గురించి తెలుసుకోవడం, ఆసక్తిగా రేడియోల్లో కామెంటరీ వినడం, టీవీల్లో లైవ్ మ్యాచులు వీక్షించడం నేర్చుకున్నారు..

910

ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా కీర్తిని ఘడించింది భారత క్రికెట్ బోర్డు. ఐపీఎల్ ద్వారా కొన్ని వేల కోట్లు ఆర్జిస్తోంది. ఎందరో యువక్రికెటర్లను వెలుగులోకి తెస్తోంది. దీనంతటికీ నాంది మాత్రం సరిగ్గా 38 ఏళ్ల క్రితం నేడే పడింది...

1010

60 ఓవర్లు ఫార్మాట్‌లో సాగిన నాటి వన్డే వరల్డ్‌కప్ తర్వాత 24 ఏళ్లకు 2007లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా, ఆ తర్వాత 2011లో 50 ఓవర్ల వన్డే వరల్డ్‌కప్ సాధించింది. ఇలా మూడు ఫార్మాట్లలోనూ వరల్డ్‌కప్ గెలిచిన ఏకైక జట్టుగా చరిత్రలో మిగిలిపోయింది భారత జట్టు.

click me!

Recommended Stories