అలా వచ్చి ఇలా మాయమయ్యారు... 2021 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారతజట్టులోని...

Published : Sep 13, 2022, 06:48 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగింది భారత జట్టు. వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన టీమిండియా, వార్మప్ మ్యాచుల్లోనూ అద్భుతాలు చేసింది. అదీకాక ఎంఎస్ ధోనీ మెంటర్‌గా ఉండడంతో ఈసారి ఇండియా, వరల్డ్ కప్ గెలవకుండా ఆపడం ఎవరితరం కాదనుకున్నారు... 

PREV
17
అలా వచ్చి ఇలా మాయమయ్యారు... 2021 టీ20 వరల్డ్ కప్ ఆడిన భారతజట్టులోని...

భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని ఆరంభించిన భారత జట్టు, మొట్టమొదటిసారి ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో పాక్ చేతుల్లో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. పాక్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడడంతోనే భారత జట్టు ఆత్మవిశ్వాసంపై తీవ్రంగా ప్రభావం చూపింది...

27

2019 వన్డే వరల్డ్ కప్, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ని ఓడించిన ప్రత్యర్థి న్యూజిలాండ్‌తో తర్వాతి మ్యాచ్ ఆడిన టీమిండియా... ఏ మాత్రం ఆసక్తి లేనట్టుగా నీరసంగా కదిలి, చిత్తుగా ఓడింది. ఈ పరాజయంతో టీమిండియా ఆశలన్నీ నీళ్లుగారిపోయాయి...

37
Varun Chakravarthy

ఈ వరుస పరాజయాలతో భారత జట్టులో సంచలన మార్పులు జరిగాయి. టీ20 వరల్డ్ కప్‌ 2021లో అద్భుతాలు చేస్తారని ఆశించిన యంగ్ ప్లేయర్లు, ఆ టోర్నీ తర్వాత టీమిండియాలో చోటు కూడా దక్కించుకోలేకపోయారు... ఈసారి ఆస్ట్రేలియాలో జరిగే పొట్టి ప్రపంచకప్‌లో వీళ్ల పేర్లు కనిపించలేదు...

47

ఐపీఎల్ 2020లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి వెలుగులోకి వచ్చాడు వరుణ్ చక్రవర్తి. మిస్టరీ చక్రవర్తిగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ చక్రవర్తిపైన భారీ ఆశలు పెట్టుకుని, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి అతన్ని ప్రధాన స్పిన్నర్‌గా ఎంపిక చేసింది టీమిండియా...

57

అయితే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో వరుణ్ మ్యాజిక్ పని చేయలేదు. పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచుల్లో కాదు కదా ఆఖరికి స్కాట్లాండ్‌పైన కూడా ఒక్క వికెట్ తీయలేకపోయాడు వరుణ్ చక్రవర్తి. ఈ ఫెయిల్యూర్‌తో మనోడు మళ్లీ టీమిండియాలో కనిపించలేదు... ఐపీఎల్‌ 2022లోనూ వరుణ్ చక్రవర్తి పెద్దగా మెప్పించలేకపోయాడు.

67

టీ20ల్లో భారత జట్టుకి ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్‌కి టీ20 వరల్డ్ కప్ 2021 జట్టులో చోటు దక్కలేదు. దీనికి సెలక్టర్లు చెప్పిన కారణం చాహాల్ కంటే రాహుల్ చాహార్, క్విక్ బౌలింగ్‌తో వికెట్లు పడగొడతాడని...

77
Rahul Chahar-Virat Kohli

అయితే యజ్వేంద్ర చాహాల్ ప్లేస్‌లో టీమ్‌లోకి వచ్చిన రాహుల్ చాహార్, నమీబియాతో జరిగిన ఆఖరి మ్యాచ్ మాత్రమే ఆడాడు. పసికూనలపై వికెట్ తీయలేకపోయిన రాహుల్ చాహార్, 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి మళ్లీ భారత జట్టులో కనిపించలేదు... 

click me!

Recommended Stories