కెఎల్ రాహుల్‌ని కాపాడుతున్న వైస్ కెప్టెన్సీ... త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలంటున్న గవాస్కర్...

First Published Sep 13, 2022, 6:28 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీ వరకూ ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు కెఎల్ రాహుల్. గాయం, సర్జరీ, ఆ తర్వాత కరోనా కారణంగా రెండు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న కెఎల్ రాహుల్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలొ భారత జట్టుకి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

ఆసియా కప్ 2022 టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెఎల్ రాహుల్, ఆఫ్ఘాన్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కెప్టెన్‌గా హాఫ్ సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చానని నిరూపించుకున్నాడు. వైస్ కెప్టెన్ అయినా జట్టు కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని కెఎల్ రాహుల్‌ని హెచ్చరిస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

Image credit: Getty

ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో కెఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన విరాట్ కోహ్లీ, సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు భారత జట్టు ఆడిన మొదటి నాలుగు మ్యాచుల్లో ఓపెనర్లు, పవర్ ప్లే వరకూ కూడా కలిసి ఆడలేకపోయారు...

కెఎల్ రాహుల్‌తో కలిసి 12 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ, తొలి వికెట్‌కి సెంచరీ భాగస్వామ్యాన్ని జోడించాడు. 61 బంతుల్లో 122 పరుగులు చేసి టీమిండియా తరుపున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు...

Image credit: Getty

‘విరాట్ కోహ్లీకి ఐపీఎల్‌లో ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. ఆర్‌సీబీకి ఓపెనర్‌గా నాలుగు సెంచరీలు, ఒకే సీజన్‌లో 921 పరుగులు చేశాడు. కాబట్టి అతనికి ఓపెనింగ్ చేయడం కొత్తేమీ కాదు. ఆ ప్లేస్‌ని అతను ఎంతో ఎంజాయ్ చేస్తాడు కూడా...

KL Rahul

టీమిండియాకి ఇప్పుడు విరాట్ కోహ్లీలాంటి ఓపెనర్ అవసరం చాలా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే బెటర్. కావాలంటే కెఎల్ రాహుల్‌ని వన్‌డౌన్‌లో ఆడించొచ్చు. లేదా సూర్యకుమార్ యాదవ్‌ని వన్‌డౌన్‌లో పంపి... రాహుల్‌ని మిడిల్ ఆర్డర్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు...

ఆసియా కప్ 2022 టోర్నీలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. కాబట్టి కెఎల్ రాహుల్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే ఆ సమస్య కాస్త తీరొచ్చు. అవసరమైతే టీమ్‌ కోసం తన ప్లేస్‌ని త్యాగం చేసేందుకు కూడా కెఎల్ రాహుల్ సిద్దంగా ఉండాల్సిందే...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

click me!