రోహిత్ శర్మను ట్రోల్ చేసిన స్విగ్గీ.... ట్రెండింగ్‌లోకి బాయ్‌కాట్ స్విగ్గీ...

Published : Apr 13, 2021, 08:05 PM ISTUpdated : Apr 13, 2021, 08:06 PM IST

ముంబై ఇండియన్స్ సారథి, భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను ట్రోల్ చేసేందుకు చూసిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ... చిక్కుల్లో పడింది. క్రికెట్‌కి ముడిపెడుతూ ఫుడ్‌ ఆర్డర్స్‌ను పెంచుకోవాలని స్విగ్గీ చేసిన ప్రయత్నం తీవ్రంగా బెడిసికొట్టేలాగే ఉంది. 

PREV
18
రోహిత్ శర్మను ట్రోల్ చేసిన స్విగ్గీ.... ట్రెండింగ్‌లోకి బాయ్‌కాట్ స్విగ్గీ...

క్రికెట్ యాంకర్ మయాంతి లంగర్, ‘ఈరోజు ముంబై 200 కొడితే నాకు వడాపావ్ కావాలి... హిట్‌మ్యాన్‌కి గౌరవం ఇవ్వాలి’ అంటూ వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తన ట్వీట్‌కి స్విగ్గీని ట్యాగ్ చేసింది మయాంతి లంగర్...

28

మయాంతి లంగర్ ట్వీట్‌కి స్పందించిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ... ‘మేం ముంబై ఇండియన్స్ బాయ్స్‌ను లవ్ చేస్తున్నాం... మయాంతి లంగర్, మీరు ఫైర్‌లో ఉన్నారు... ఛాలెంజ్ అంగీకరిస్తున్నాం’ అంటూ కామెంట్ చేసింది...

38

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా... రోహిత్ శర్మ, వడాపావ్ బండి ముందు వాలిపోతున్నట్టు ఓ నెటిజన్ ఎడిట్ చేసి వేసిన ఫోటోకి  స్విగ్గీ స్పందించిన తీరు అందర్నీ ఆగ్రహానికి గురి చేసింది.

48

‘హేటర్స్ దీన్ని ఫోటోషాప్ చేశారని అంటారు’ అంటూ కామెంట్ చేసింది స్విగ్గీ... అంటే రోహిత్ శర్మ ఇలాగే చేస్తాడని ఒప్పుకుంటున్నట్టు స్విగ్గీ చేసిన కామెంట్ వివాదాస్పదమైంది...

58

తప్పును గ్రహించిన స్విగ్గీ, ఈ ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేసినా... అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కామెంట్‌ను చాలామంది రోహిత్ అభిమానులు, స్క్రీన్ షాట్ తీయడం, ‘బాయ్‌కాట్ స్విగ్గీ’ ట్యాగ్‌ను ట్రెండ్ చేయడం మొదలెట్టేశారు...

68

టీమిండియాకి ఎన్నో విజయాలు, ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన లెజెండరీ క్రికెటర్‌ను ఇలా అవమానించడం కరెక్టు కాదని, వెంటనే స్విగ్గీ యాప్‌ను డిలీట్ చేస్తున్నామంటూ పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు...

78

దీనిపై స్విగ్గీ ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే అప్పుడు ఈ సంఘటనపై సోషల్ మీడియాలో జోకులు కూడా పేలుతున్నాయి...

88

రోహిత్ శర్మను అవమానించిన స్విగ్గీని, ముంబై ఇండియన్స్ అధినేత ముకేశ్ అంబానీ కొనుగోలు చేసేస్తారని... అప్పుడు స్విగ్గీ ఎలాంటి పోస్టులు చేస్తుందో చూడాలని ఫన్నీ పోస్టులు చేస్తున్నారు. 

click me!

Recommended Stories