MIvsKKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... మరోసారి రోహిత్ శర్మకు...

First Published Apr 13, 2021, 7:11 PM IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్... వరుసగా రెండు మ్యాచుల్లో టాస్ ఓడిన రోహిత్ శర్మ...

క్రిస్ లీన్ స్థానంలో క్వింటన్ డికాక్ రీఎంట్రీ... జట్టులో మార్పులు లేకుండా బరిలో దిగుతున్న కేకేఆర్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై తొలుత బ్యాటింగ్ చేయనుంది.
undefined
గత మ్యాచ్‌లో బరిలో దిగని ముంబై ఇండియన్స్ ఓపెనర్ క్వింటన్ డి కాక్, తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఎలాంటి మార్పులు లేకుండా గత మ్యాచ్‌లో బరిలో దిగిన జట్టునే కొనసాగించింది.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభమ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం అందుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. దీంతో ఇరుజట్ల మధ్య సమరం ఆసక్తికరంగా సాగనుంది.
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు: నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రస్సెల్, దినేశ్ కార్తీక్, షకీబ్ అల్ హసన్, ప్యాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి
undefined
ముంబై ఇండియన్స్:రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా, మార్కో జాన్సన్, రాహుల్ చాహార్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా
undefined
click me!