సూర్యకుమార్ యాదవ్‌ను అవుట్ చేయాలంటే ముగ్గురు కావాల్సిందే...

First Published Mar 21, 2021, 11:28 AM IST

సూర్యకుమార్ యాదవ్ చాలా స్పెషల్ ప్లేయర్. ఇండియన్ 360 డిగ్రీ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్, అవుట్ అవ్వడంలోనూ స్పెషాలిటీ చూపించాడు. ఏ బ్యాట్స్‌మెన్ అయినా అవుట్ అవ్వడానికి ఒక్కరు లేదా ఇద్దరే కావాలి. కానీ సూర్యకుమార్ యాదవ్‌ని అవుట్ చేయడానికి ముగ్గురు కావాల్సి వస్తోంది...

నాలుగేళ్లుగా ఐపీఎల్‌లో అదరగొడుతున్నా... ఎట్టకేలకు ఇంగ్లాండ్ సిరీస్ ద్వారా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న సూర్యకుమార్ యాదవ్, రెండు ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అందర్నీ ఆకట్టుకున్నాడు.
undefined
మూడు మ్యాచులు ఆడినా, రెండే సార్లు బ్యాటింగ్ దక్కించుకున్న సూర్యకుమార్ యాదవ్ సిక్సర్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను మొదలెట్టిన విషయం తెలిసిందే..
undefined
నాలుగో టీ20లో ఆర్చర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది, కెరీర్‌ను ఘనంగా ఆరంభించిన సూర్యకుమార్ యాదవ్... తొలి మ్యాచ్‌లో వివాదాస్పద క్యాచ్‌తో అవుట్‌ అయిన విషయం తెలిసిందే.
undefined
శామ్ కుర్రాన్ బౌలింగ్‌లో మొదటి బంతికే భారీ సిక్సర్ బాదిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాతి బంతికి అదే రకమైన షాట్‌కి యత్నించి, డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
undefined
అయితే టీవీ రిప్లైలో డేవిడ్ మలాన్ పట్టిన క్యాచ్‌, బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే పలుమార్లు రిప్లై చూసిన థర్డ్ అంపైర్, అవుట్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది...
undefined
ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ అవుట్ అవ్వడానికి బౌలర్, ఫీల్డర్‌తో పాటు థర్డ్ అంపైర్ కూడా కారణమని ఒప్పుకోవాల్సిందే.
undefined
ఆఖరి టీ20లో కూడా వన్‌డౌన్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్, మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయినా ఆ తర్వాతి రెండు బంతుల్లో వరుస సిక్సర్లు బాదాడు... జోర్డాన్ బౌలింగ్‌లో చూడచక్కని హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు.
undefined
17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, రషీద్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్‌కి ప్రయత్నించాడు.
undefined
అయితే బౌండరీ లైన్‌ దగ్గర పరుగెత్తుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్న జోర్డాన్, లైన్ దాటే ముందు బంతిని జాసన్ రాయ్‌వైపు వేశాడు. రాయ్ చక్కగా నిలబడి క్యాచ్ తీసుకోవడంతో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు.
undefined
స్టంపౌట్, క్యాచ్, బౌల్డ్, రనౌట్, ఎల్బీడబ్ల్యూ... ఇలా ఏ బ్యాట్స్‌మెన్‌కైనా అవుట్ అవ్వడానికి ఒకరు లేదా ఇద్దరు ప్లేయర్ల తోడ్పాడు అవసరమైతే, సూర్యకుమార్ యాదవ్ విషయంలో మాత్రం ముగ్గురు కావాల్సి వస్తోందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
undefined
click me!