రికార్డుల తుప్పును వదిలిస్తున్న మిస్టర్ 360.. సూర్యకుమార్ యాదవ్ జోరుకు ఆకాశమే హద్దు

First Published Sep 29, 2022, 12:21 PM IST

Suryakumar Yadav: టీ20లలో భారత మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్  జోరు కొనసాగిస్తున్నాడు. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ నయా మిస్టర్ 360..  పాత రికార్డుల తుప్పు వదిలిస్తున్నాడు.
 

పొట్టి ఫార్మాట్ లో  ప్రపంచ నెంబర్ 2 బ్యాటర్ గా ఉన్న టీమిండియా సంచలనం సూర్యకుమార్ యాదవ్  అందుకు తగ్గట్టుగానే ఆడుతున్నాడు. ప్రత్యర్థి ఎవరు..? ఆటలో పరిస్థితులతో సంబంధం లేకుండా  ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నాడు.  ఏడాదికాలంగా నిలకడగా రాణిస్తున్న సూర్య.. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్ లో తన పేరిట పలు రికార్డులు నమోదు చేసుకున్నాడు.  

Image credit: PTI

బౌలింగ్ కు అనుకూలిస్తున్న తిరువనంతపురంపై టీమిండియా  వరుసగా రోహిత్, కోహ్లీ వికెట్లను కోల్పోవడంతో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సూర్య భారత ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు.  కెఎల్ రాహుల్ తో కలిసి భారత్ ను విజయతీరాలకు చేర్చాడు. 

Suryakumar Yadav

ఈ మ్యాచ్  లో హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు సిక్సర్ల రూపంలో మెరుపులు మెరిపించడం ద్వారా సూర్య  పలు  పాత రికార్డులను  చెరిపేశాడు. గతంలో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్, టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ సాధించిన రికార్డులను తుడిచేశాడు. 

నిన్నటి మ్యాచ్ లో సూర్య  3 సిక్సర్లు కొట్టాడు. ఆడిన  రెండో బంతి తో పాటు మూడో బంతిని కూడా స్టాండ్స్ లోకి పంపాడు. దీంతో ఒక క్యాలెండర్ ఈయర్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా  సూర్య రికార్డు సృష్టించాడు.   ఈ క్యాలెండర్ ఈయర్  (టీ20లలో) లో సూర్య మొత్తంగా  45 సిక్సర్లు బాదాడు. 

గతంలో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్.. 2021లో 42 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ సూర్య ఇప్పుడు రిజ్వాన్ రికార్డును తుడిపేశాడు. ఈ జాబితాలో మార్టిన్ గప్తిల్ (2021 లో 41 సిక్సర్లు),   ఉగాండాకు చెందిన టీపి ఉర (39 - 2022లో) మహ్మద్ వసీం (2022 లో 38) లు టాప్-5లో ఉన్నారు. 

ఈ రికార్డుతో పాటు ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న సూర్య.. ఒక క్యాలెండర్ ఈయర్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్ గా  రికార్డులకెక్కాడు. ఈ ఏడాదిలో  సూర్య ఇప్పటివరకు 732 పరుగులు చేశాడు.

గతంలో శిఖర్ ధావన్.. 2018లో 689 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.    ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (641-2016లో),  రోహిత్ శర్మ (590-2018లో, 497-2022లో), తర్వాత స్థానాల్లో నిలిచారు.  

click me!