శకునం తేడా కొడుతుందే! టీమిండియా గెలిచినా... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెత్త రికార్డులు...

First Published Sep 29, 2022, 12:18 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇంకా రెండు అంతర్జాతీయ టీ20ల దూరం మాత్రమే ఉంది. సౌతాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ముగిసిన తర్వాత పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కబోతోంది భారత జట్టు. ఈ మెగా టోర్నీకి ప్రాక్టీస్‌గా జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత జట్టు బోణీ కొట్టింది...

స్వదేశంలో ఇప్పటిదాకా టీ20 సిరీస్ నెగ్గని భారత జట్టు, తిరువనంత పురంలో 8 వికెట్ల తేడాతో గెలిచి 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా మరో మ్యాచ్ గెలిస్తే స్వదేశంలో సఫారీలపై టీ20 సిరీస్ గెలిచిన భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తాడు...

Image credit: PTI

ఆ రికార్డు ఎలా ఉన్నా తొలి టీ20లో డకౌట్ అయిన రోహిత్ శర్మ, కెరీర్‌లో చెత్త రికార్డును నెలకొల్పాడు. ఈ ఏడాది వెస్టిండీస్‌తో వన్డేలో డకౌట్ అయిన రోహిత్ శర్మ, తాజాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ డకౌట్ అయ్యాడు. ఒకే ఏడాది టీ20ల్లో రెండు సార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు రోహిత్ శర్మ...

Image credit: PTI

107 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయితే విరాట్ కోహ్లీ 9 బంతుల్లో 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. టీ20ల్లో లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీకి ఇది అత్యల్ప స్కోరు. అంతేకాకుండా టీ20 లక్ష్యఛేదనలో విరాట్‌కి ఇది రెండో సింగిల్ డిజిట్ స్కోరు...

Image credit: PTI

ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి స్వదేశంలో 32 టీ20 మ్యాచులు కలిసి ఆడారు. అయితే ఈ ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో 5 పరుగుల కంటే తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడం ఇదే మొట్టమొదటిసారి...

Rohit Sharma

తిరువనంతపురం టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన రవిచంద్రన్ అశ్విన్ ఓ మెయిడిన్‌తో 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. వికెట్ తీయలేకపోయిన భారత స్పిన్నర్‌కి టీ20ల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు 2016లో శ్రీలంకపై 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ మెయిడిన్‌తో 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు రవిచంద్రన్ అశ్విన్...

click me!