పొజిషన్ ఏదైనా, రోల్ ఏదైనా నేను రెఢీ, బౌలింగ్ కూడా చేసేస్తా... సూర్యకుమార్ యాదవ్ కామెంట్..

Published : Feb 08, 2022, 06:52 PM IST

ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనతో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఆరంగ్రేటం నుంచి నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సూర్యకుమార్ యాదవ్, వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

PREV
19
పొజిషన్ ఏదైనా, రోల్ ఏదైనా నేను రెఢీ, బౌలింగ్ కూడా చేసేస్తా... సూర్యకుమార్ యాదవ్ కామెంట్..

వరుసగా నాలుగు వన్డేల్లో 30+ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్, పొజిషన్ ఏదైనా బ్యాటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కామెంట్ చేశాడు. 

29

వరుసగా నాలుగు వన్డేల్లో 30+ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్, పొజిషన్ ఏదైనా బ్యాటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కామెంట్ చేశాడు. 

39

‘ఏ బ్యాటింగ్ పొజిషన్ అయినా నాకు ఇబ్బంది లేదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఎక్కడ బ్యాటింగ్ చేయమంటే, అక్కడ ఆడడానికి నేను రెఢీ... బ్యాటింగ్ ఆర్డర్‌తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు...

49

బ్యాటింగ్ ఆర్డర్‌లో నేను వన్‌డౌన్‌లో, టూ డౌన్‌లో, ఐదో స్థానంలో కూడా బ్యాటింగ్ చేశా. ఎక్కడ బ్యాటింగ్ చేసినా, పరుగులు చేయగలిగితే చాలు కదా...

59

నేను తరుచూగా నెట్ ప్రాక్టీస్ సెషన్స్‌లో బౌలింగ్ చేస్తున్నా. టీమ్‌కి ఎప్పుడు అవసరమైతే అప్పుడు బౌలింగ్ చేయడానికి కూడా నేను రెఢీగా ఉన్నాను...

69

టీమిండియా తరుపున టెస్టులు ఆడాలనేది నా కోరిక. టీ20, వన్డేలతో పోలిస్తే రెడ్ బాల్ క్రికెట్ ఆడడమంటేనే నాకు చాలా ఇష్టం...

79

పది మ్యాచులు కూడా ఆడని నన్ను, ఎవరితోనే పోల్చడం సరికాదని నా ఉద్దేశం... ఇప్పటికైతే నన్ను సూర్యకుమార్ యాదవ్‌గానే ఉండనివ్వండి...’ అంటూ కామెంట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్...

89

టీమిండియా తరుపున 5 వన్డేలు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 65.67 యావరేజ్‌తో 197 పరుగులు చేశాడు. 11 టీ20ల్లో 3 హాఫ్ సెంచరీలతో 244 పరుగులు చేశాడు...

99

77 ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 5300+ పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, బౌలింగ్‌లో 24 వికెట్లు కూడా తీశాడు. ఐపీఎల్‌లో 9 సీజన్లలో 2014లో ఒకే ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు సూర్యకుమార్ యాదవ్...

click me!

Recommended Stories