శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌ కోసం సూర్యకుమార్‌తో శుబ్‌మన్ గిల్ పోటీ... రోహిత్ శర్మ ఎవరివైపు...

First Published Feb 3, 2023, 11:17 AM IST

న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లను విజయాలతో ముగించిన భారత జట్టు, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలెట్టేసింది టీమిండియా... గాయం కారణంగా నాగ్‌పూర్‌లో జరిగే తొలి టెస్టుకి శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు...

Image credit: Getty

విదేశాల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా స్వదేశంలో శ్రేయాస్ అయ్యర్‌కి మంచి రికార్డు ఉంది. స్పిన్‌ని చక్కగా ఆడగల శ్రేయాస్ అయ్యర్, 7 టెస్టుల్లో 12 ఇన్నింగ్స్‌ల్లో 56.7 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
 

Image credit: Getty

2021 డిసెంబర్‌లో అజింకా రహానే గాయంతో తప్పుకోవడంతో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో టెస్టు ఆరంగ్రేటం చేశాడు శ్రేయాస్ అయ్యర్. మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన 16వ భారత బ్యాటర్‌గా నిలిచాడు...
 

suryakumar

శ్రేయాస్ అయ్యర్ గాయపడడంతో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసే బ్యాట్స్‌మెన్ కోసం వెతుకుతోంది భారత జట్టు... ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన సూర్యకుమార్ యాదవ్‌తో పాటు శుబ్‌మన్ గిల్ ఈ ప్లేస్ కోసం పోటీపడుతున్నారు...

ఆస్ట్రేలియా టూర్‌లో శుబ్‌మన్ గిల్ చక్కని ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత గాయపడి జట్టుకి దూరమయ్యాడు శుబ్‌మన్ గిల్. ఇదే సమయంలో కెఎల్ రాహుల్ టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చి, రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. రాహుల్ టెస్టు వైస్ కెప్టెన్సీ కూడా దక్కించుకోవడంతో గిల్ రిజర్వు బెంచ్‌కే పరిమితం అవుతూ వచ్చాడు...

రోహిత్ శర్మ గాయపడడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీ చేసిన శుబ్‌మన్ గిల్, ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించాలా? శుబ్‌మన్ గిల్‌ని ఆడించాలా? అనేది రోహిత్ శర్మ కోర్టులోకి చేరింది..

suryakumar

సూర్యకుమార్ యాదవ్ టీ20 ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్నా, వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. అలాంటి సూర్య, టెస్టు ఫార్మాట్‌లో రాణించగలుగుతాడా? తెలీదు.. అందుకే టెస్టుల్లో అనుభవం లేని సూర్యకుమార్ యాదవ్ కంటే శుబ్‌మన్ గిల్‌ని ఆడించడమే కరెక్ట్ అంటున్నారు కొందరు...

రిషబ్ పంత్‌ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈ టెస్టు సిరీస్‌కి దూరం కావడంతో కెఎల్ రాహుల్‌ని వికెట్ కీపర్‌గా వాడుతూ సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్ ఇద్దరికీ తుది జట్టులో అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు... అయితే టీ20, వన్డేల్లో వికెట్ కీపింగ్ చేయడం, టెస్టుల్లో వికెట్ కీపింగ్ చేసి బ్యాటింగ్ చేయడం ఒక్కటి కాదు.. 

ముంబై ఇండియన్స్ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ వైపు రోహిత్ శర్మ మొగ్గు చూపిస్తాడా? లేక బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ని మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తాడా? అనేది తెలియాలంటే ఫిబ్రవరి 9 దాకా వేచి చూడాల్సిందే.. 

click me!