రవి భిష్ణోయ్‌ని సరిగ్గా వాడుకుంటే రషీద్ ఖాన్‌లా మారతాడు... - సురేష్ రైనా కామెంట్..

First Published Feb 3, 2023, 10:51 AM IST

అండర్ 19 వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్‌లోకి, ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి వచ్చాడు రవి భిష్ణోయ్. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన రవి భిష్ణోయ్, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌లో ఉన్నాడు. అయితే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి సీనియర్ల వల్ల రవి భిష్ణోయ్‌కి రావాల్సినన్ని అవకాశాలు రావడం లేదు...

Ravi Bishnoi

టీమిండియా తరుపున ఓ వన్డే, 10 టీ20 మ్యాచులు ఆడిన రవి భిష్ణోయ్, మొత్తంగా 17 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో ఆఖరిగా ఆడాడు రవి భిష్ణోయ్. ఆ మ్యాచ్‌‌లో 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన రవి భిష్ణోయ్, టీమిండియా తరపున బెస్ట్ ఎకానమీ నమోదు చేశాడు...

Image credit: Getty

అయితే ఆ మ్యాచ్ తర్వాత రవి భిష్ణోయ్‌న పూర్తిగా పక్కనబెట్టేసింది భారత జట్టు. యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి సీనియర్ల కారణంగా రవి భిష్ణోయ్, టీమ్‌లో చోటు దక్కించుకోలేక ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు...
 

Ravi Bishnoi

‘రవి భిష్ణోయ్ బౌలింగ్ టెస్టులకు బాగా సూట్ అవుతుంది. అతని క్యారెక్టర్, డెలివరీ చేసే విధానం ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్‌కి దగ్గరగా ఉంటుంది. సరిగ్గా వాడుకుంటే రవి భిష్ణోయ్, టీమిండియాకి రషీద్ ఖాన్‌లా మారతాడు.. ఆ సత్తా అతనిలో ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా...

టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా మాత్రం తిలక్ వర్మ, టీమిండియా ఫ్యూచర్ స్టార్ అవుతాడని కామెంట్ చేశాడు. ‘తిలక్ వర్మ, హైదరాబాద్‌కి చెందినవాడు. చిన్నతనం నుంచి క్లిష్టమైన పరిస్థితులను ఎలా ఫేస్ చేయాలో తెలుసుకుంటూ పెరిగాడు. అండర్15, అండర్16 క్రికెట్ టోర్నీల్లోనే తిలక్ వర్మ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...
 

ఉదయం 6 గంటలకు గ్రౌండ్‌కి వెళ్లి, సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చేవాడు. మధ్యలో ఓ అరగంట లంచ్ బ్రేక్. మిగిలిన 12 గంటలు కూడా ప్రాక్టీస్ మీదనే ఫోకస్ పెట్టేవాడు. అతని డెడికేషన్ అలాంటిది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా...

click me!