అంటే సుందరానికి గాయాలెక్కువ.. జింబాబ్వే సిరీస్ నుంచి తప్పుకున్న వాషింగ్టన్ సుందర్

Published : Aug 16, 2022, 11:11 AM IST

Washington Sundar: టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్.. జింబాబ్వే పర్యటన నుంచి సుందర్ తప్పుకున్నాడు. అతడు  త్వరలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో చికిత్స పొందనున్నాడు.   

PREV
17
అంటే సుందరానికి గాయాలెక్కువ.. జింబాబ్వే సిరీస్ నుంచి తప్పుకున్న వాషింగ్టన్ సుందర్

టీమిండియా యువ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ మరోసారి  గాయపడ్డాడు. జట్టులోకి వచ్చినప్పట్నుంచి  గాయాలతోనే సావాసం చేస్తున్న ఈ చెన్నై చిన్నోడు.. తాజాగా జింబాబ్వే సిరీస్ కు ఎంపికైనా గాయం కారణంగా మళ్లీ పాత బాటలోనే నడిచాడు. 

27

దేశవాళీలోనో, కౌంటీలలోనూ బాగా ఆడటం.. తనను తాను నిరూపించుకుని జట్టులోకి తీసుకునేసరికి  సరిగ్గా సిరీస్ కు ముందు గాయపడటం.. ఇదే తంతు. సుమారు ఏడాది కాలంగా ఇదే సీన్ రిపీట్ అవుతుందే తప్ప  పెద్దగా మార్పులేమీ లేవు. 

37

ఇటీవలే ఇంగ్లాండ్ కౌంటీలలో అదరగొడుతున్న ఈ యువ ఆల్ రౌండర్ ను  జింబాబ్వే టూర్ కు ఎంపిక చేశారు సెలక్టర్లు. అతడు ఆడటం పక్కా అనుకున్నారు. కానీ విధి మాత్రం అతడికి మరో‘సారీ’ చెప్పింది. కౌంటీలలో ఆడుతుండగా అతడికి గాయమైంది. 
 

47

ఇంగ్లాండ్ లో రాయల్ లండన్ కప్ ఆడుతున్న సుందర్.. లంకాషైర్, వర్సెస్టర్‌షైర్ మధ్య ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డాడు.  అతడికి ఎడమ చేతి భుజానికి గాయమైంది.  కానీ అప్పటికే జింబాబ్వే వెళ్లే భారత జట్టును  ఎంపిక చేసింది టీమిండియా. ఇక అతడి గాయం పరిశీలించిన వైద్య బృందం సుందర్‌కు విశ్రాంతి తప్పదని తెలపడంతో  బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 

57

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘అవును. జింబాబ్వే పర్యటన నుంచి సుందర్ తప్పుకున్నాడు. అతడి ఎడమచేతి భుజానికి గాయమైంది. అతడు  త్వరలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో చికిత్స తీసుకుంటాడు..’ అని తెలిపాడు. వాషింగ్టన్ అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ వరుస గాయాలు అతడి పాలిట దురదృష్టంగా మారాయని సదరు ప్రతినిధి చెప్పాడు. 

67

సుందర్ కు గాయమవడం ఇదేం కొత్త కాదు.  మరీ ముఖ్యంగా గత ఏడాది కాలంగా అతడు గాయాలతో సావాసం చేస్తూనే ఉన్నాడు. 2021 జులై లో కోవిడ్ బారిన పడ్డ అతడు.. ఆ తర్వాత చేతి వేలికి గాయమై జట్టుకు దూరమయ్యాడు. దానినుంచి కోలుకున్నాక.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో ఎంపికైనా చివరి నిమిషంలో మళ్లీ కోవిడ్ బారిన పడి  ఆ పర్యటనకు దూరమయ్యాడు. 

77

దక్షిణాఫ్రికా సిరీస్ తో పాటు స్వదేశంలో జరిగిన వెస్టిండీస్, శ్రీలంక సిరీస్ లలో కూడా అతడు దూరమయ్యాడు.  ఆ తర్వాత ఐపీఎల్ లో పలు మ్యాచులు ఆడాడు. ఇటీవలే కౌంటీలలో ఆడుతున్న అతడు తాజాగా మళ్లీ భుజానికి గాయం కావడంతో జింబాబ్వే సిరీస్ కు దూరమయ్యాడు.

click me!

Recommended Stories