సూర్యకుమార్‌ యాదవ్ ఆడే షాట్స్ ఇంతకుముందు ఎవ్వరూ ఆడలేదు... - రికీ పాంటింగ్

First Published Jan 28, 2023, 11:23 AM IST

ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు దక్కించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. గత ఏడాదిలో రెండు టీ20 సెంచరీలతో 164 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 187.43 స్ట్రైయిక్ రేటుతో సెన్సేషనల్ బ్యాటింగ్ చేశాడు. తాజాగా సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్...

suryakumar

ఐసీసీ టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్, ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు సూర్య...

సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ బ్యాటింగ్‌ని కొందరు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్‌తో, మరికొందరు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పోలుస్తున్నారు. అయితే రికీ పాంటింగ్ మాత్రం భిన్నంగా స్పందించాడు...

suryakumar

‘సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్న విధానం టాప్ క్లాస్. ఇంతకుముందు ఎవ్వరూ కూడా ఇలాంటి షాట్స్ ఆడలేకకపోయారు. 360 డిగ్రీల్లో బ్యాటింగ్ చేయగల ప్లేయర్ల గురించి మాట్లాడుతున్నాం...

suryakumar

అయితే వికెట్ కీపర్‌ పక్కనుంచి, ఓవర్ ఫైన్ లెగ్ నుంచి సూర్యకుమార్ యాదవ్ ఆడే షాట్స్ ఇంతకుముందెప్పుడూ చూడలేదు... ఇంతకుముందు ఎవ్వరూ ఇలాంటి షాట్స్ ఆడడం నేనైతే చూడలేదు. ఐదారేళ్ల నుంచి ఐపీఎల్‌లో సూర్య ఇలాంటి షాట్స్ ఆడుతున్నాడు...

suryakumar

షాట్ బాల్స్‌ని కూడా చూడచక్కని సిక్సర్లుగా మలచగలడు సూర్య. కీపర్ తల మీద నుంచి షార్ట్ బాల్స్‌ని సిక్సర్లుగా మలుస్తున్న విధానం అసాధారణంగా ఉంటుంది. వీడియో గేమ్ ఆడినంత ఈజీగా షాట్స్ ఆడుతున్నాడు...

కొత్త కొత్త షాట్స్‌ని కనిపెట్టడంలో సూర్య ముందున్నాడు. అతని స్కిల్స్, టాలెంట్... టీ20ల్లో సూర్యని స్టార్ ప్లేయర్‌గా మార్చేశాయి. సూర్య ఈజీగా ఆడే షాట్స్, మిగిలిన బ్యాటర్లు ఎలా ఆడాలా? అని కష్టపడుతున్నారు...

suryakumar

కొంత మంది బ్యాటర్లు, సూర్య ఆడుతున్నట్టుగా ఆడతామని చాలామంది చెప్పారు. సూర్య కనిపెట్టిన కొత్త షాట్స్, క్రికెట్‌లో సంచలన మార్పులు తీసుకురాబోతున్నాయని అనిపిస్తోంది...’ అంటూ ఐసీసీ రివ్యూ మీటింగ్‌లో చెప్పుకొచ్చాడు రికీ పాంటింగ్...

click me!