సూర్య కొన్ని బ్రిలియెంట్ షాట్స్ ఆడాడు, కానీ అది మాత్రం... సచిన్ టెండూల్కర్ కామెంట్...

Published : Jul 11, 2022, 12:00 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో అద్భుత సెంచరీతో అదరగొట్టాడు సూర్యకుమార్ యాదవ్. 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం అందించి, భారత జట్టు తరుపున ఒంటరి పోరాటం చేశాడు సూర్యకుమార్ యాదవ్...

PREV
17
సూర్య కొన్ని బ్రిలియెంట్ షాట్స్ ఆడాడు, కానీ అది మాత్రం... సచిన్ టెండూల్కర్ కామెంట్...

49 బంతుల్లో సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్, 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 216 పరుగుల లక్ష్యఛేదనలో సూర్య సెంచరీ కారణంగానే 17 పరుగుల తేడాతో పోరాడి ఓడింది భారత జట్టు..

27

టీ20ల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి అత్యధిక స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, టీమిండియా తరుపున రోహిత్ శర్మ (118) తర్వాత అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 

37

సూర్యకుమార్ యాదవ్‌కి అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే మొదటి సెంచరీ. నాలుగు అంతకంటే కింద బ్యాటింగ్‌కి వచ్చి సెంచరీ బాదిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. ఇంతకుముందు కెఎల్ రాహుల్ 2016లో వెస్టిండీస్‌పై ఈ ఫీట్ సాధించాడు...

47

సూర్యకుమార్ యాదవ్ 117 పరుగులు చేస్తే ఆ తర్వాత భారత జట్టులో అత్యధిక స్కోరు శ్రేయాస్ అయ్యర్ చేసిన 28 పరుగులు మాత్రమే. టాప్ స్కోరర్‌కీ, రెండో టాప్ స్కోరర్‌కీ మధ్య పరుగుల తేడా 89 పరుగులు. టీ20ల్లో టీమిండియాకి ఇదే అత్యధికం...

57

సూర్యకుమార్ యాదవ్ సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా ద్వారా స్పందించాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ‘అమేజింగ్ 100 సూర్యకుమార్ యాదవ్... సూర్య ఆడి షాట్స్‌లో కొన్ని బ్రిలియెంట్ షాట్స్ ఉన్నాయి. అయితే ఓవర్‌ పాయింట్‌లో సూర్యకొట్టిన స్కూప్ సిక్సర్ మాత్రం... అద్భుతం...’ అంటూ ట్వీట్ చేశాడు సచిన్ టెండూల్కర్..

67

‘నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి. సూర్యకుమార్ యాదవ్ కారణంగా మేం చాలా టెన్షన్ పడ్డాం... అమేజింగ్ ఇన్నింగ్స్ సూర్య...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్...

77

‘సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చూస్తుంటే చూడడానికి అద్భుతంగా ఉంటుంది. అతని బ్యాటింగ్‌ని ఎప్పటి నుంచో చూస్తున్నా. అతను టీ20 ఫార్మాట్‌ను అమితంగా ప్రేమిస్తాడు... అతని దగ్గర లెక్కలేనన్ని షాట్స్ ఉన్నాయి... అతను ఫ్లోలో ఉంటే ఎవ్వరూ ఆపలేరు...’ అంటూ కామెంట్ చేశాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ...

Read more Photos on
click me!

Recommended Stories