ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య భాయ్ దూకుడు... వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి జస్ప్రిత్ బుమ్రా...

Published : Jul 14, 2022, 10:59 AM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీతో సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడిన భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోకి బుల్లెట్‌లా దూసుకొచ్చాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో 44 స్థానాలు ఎగబాకి టాప్ 5 పొజిషన్‌లో సెటిల్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్...

PREV
110
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్య భాయ్ దూకుడు... వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి జస్ప్రిత్ బుమ్రా...

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, రెండో టీ20లో 11 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

210

ట్రెంట్‌బ్రిడ్జీలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 216 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఒంటరి పోరాటం చేసి... సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు...

310

ఈ ఇన్నింగ్స్ కారణంగా టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్, ప్రస్తుతం 732 పాయింట్లతో ఉన్నాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టాప్‌లో ఉంటే, మహ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో, అయిడిన్ మార్క్‌రమ్ 3, డేవిడ్ మలాన్ 4 స్థానాల్లో ఉన్నారు...

410
Image credit: PTI

గత వారం టాప్ 6లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఫెయిల్ కావడంతో ఆరు స్థానాలు కోల్పోయి టాప్ 12 ర్యాంకులోకి పడిపోయాడు...

510

టాప్ 18లో రోహిత్ శర్మ, 19లో కెఎల్ రాహుల్, 21లో శ్రేయాస్ అయ్యర్ ఉండగా కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేని భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ టాప్ 25లోకి పడిపోయాడు... మిగిలిన భారత బ్యాటర్లు ఎవ్వరూ టాప్ 50లో కూడా లేరు...

610

ఇంగ్లాండ్‌తో, అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లలో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన భువనేశ్వర్ కుమార్, ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 8లో ఉన్నాడు...

710

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7.2 ఓవర్లలో 3 మెయిడిన్లతో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన ఇచ్చిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా... ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లాడు...

810

జస్ప్రిత్ బుమ్రా మూడు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్‌లోకి వెళ్లగా న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, పాక్ బౌలర్ షాహిదీ ఆఫ్రిదీ,ఆసీస్ బౌలర్ జోష్ హజల్‌వుడ్, ఆఫ్ఘాన్ బౌలర్ ముజీబ్ వుర్ రెహ్మాన్ టాప్ 5లో వరుసగా ఉన్నారు...

910

గాయం కారణంగా తొలి వన్డేలో ఆడని భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ 3లో ఉండగా ఈ ఏడాది తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ టాప్ 4లో ఉన్నాడు.. 

1010

ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో రెండో స్థానంలో ఉన్న భారత జట్టు, వన్డే్లలో మూడో స్థానంలో కొనసాగుతోంది. టీ20 ర్యాంకింగ్స్‌లో నెం.1 పొజిషన్‌లో ఉన్న టీమిండియా... మూడు ఫార్మాట్లలో టాప్ 3లో ఉన్న ఏకైక జట్టుగా నిలిచింది..

click me!

Recommended Stories