CSK vs MI: సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్ చేసిన ముంబై !
CSK vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మార్చి 23న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది.
CSK vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మార్చి 23న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది.
Mumbai Indians: భారత టీ20I జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో 2025 లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ప్రారంభ మ్యాచ్‌లో ఆ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకపోవడంతో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టును నడిపిస్తాడు.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్‌లో నెమ్మదిగా బౌలింగ్ (స్లో ఓవర్ రేట్) చేసినందుకు హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు. 31 ఏళ్ల హార్దిక్ పాండ్యాకు ఒక మ్యాచ్ నిషేధం, రూ. 30 లక్షల జరిమానా విధించడం ఇది మూడోసారి.
ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. చివరి ఓవర్ దాదాపు రెండు నిమిషాలు ఆలస్యంగా వేశారని తనకు తెలుసునని చెప్పాడు. కొన్నిసార్లు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడం తన చేతుల్లో లేదని కూడా అన్నాడు.
"అది నా నియంత్రణలో లేదు. గత సంవత్సరం ఆటలో భాగంగా స్లో ఓవర్ రేట్ జరిగింది. చివరి ఓవర్‌ను ఒకటిన్నర లేదా రెండు నిమిషాలు ఆలస్యంగా వేశాం. ఆ సమయంలో దాని పరిణామాలు నాకు తెలియవు" అని హార్దిక్ పాండ్యా అన్నాడు. అలాగే, తాను లేని సమయంలో సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించడానికి సరైన ఎంపిక అని కూడా హార్దిక్ అన్నాడు.
2024లో ముంబై ఇండియన్స్ జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా హార్దిక్ నియమితుడయ్యాడు. ముంబై టీమ్ ను 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ శర్మ స్థానంలో హర్దిక్ నియమితుడయ్యాడు.
హార్దిక్ 45 ఐపీఎల్ మ్యాచ్‌లకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇందులో 26 మ్యాచ్ లను గెలవగా, 19 ఓడిపోయాడు. పాండ్యా గెలుపు శాతం దాదాపు 57.7% ఉంది. ఐపీఎల్ 2024లో ముంబై 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి చివరి స్థానంలో నిలిచింది.
దీనికి ముందు, హార్దిక్ పాండ్యా రెండు సీజన్లు గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించాడు. మొదటి సీజన్‌లో ట్రోఫీని అందించగా, ఆ తర్వాతి సీజన్ లో రన్నరప్‌గా నిలిపాడు.