IPL 2025: ఐపీఎల్ లో చితక్కొడతామంటున్న ఫారిన్ స్టార్స్ !

Published : Mar 19, 2025, 09:24 PM IST

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 టోర్నీ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈసారి ఐపీఎల్‌లో కొంతమంది విదేశీ ఆటగాళ్లు అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు? ఎలా దంచికొడతారో చూద్దాం. 

PREV
15
IPL 2025: ఐపీఎల్ లో చితక్కొడతామంటున్న ఫారిన్ స్టార్స్ !

1. జోస్ బట్లర్

జట్టు: గుజరాత్ (గుజరాత్ టైటాన్స్)

కొన్నేళ్లుగా రాజస్థాన్ తరఫున దుమ్మురేపుతున్న ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్, ఈసారి గుజరాత్ తరఫున ఆడనున్నాడు. 2022లో అద్భుతమైన ఆటతో 863 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మరోసారి దుమ్మురేపుతానంటున్నాడు.

25
IPL 2025 Top 5 Overseas Players to Watch This Tournament

2. ఫిల్ సాల్ట్

జట్టు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)

ఇంగ్లాండ్‌కు చెందిన విధ్వంసకర ఆటగాడు ఫిల్ సాల్ట్ ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున బరిలోకి దిగుతున్నాడు. కోహ్లీతో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. తనదైన స్టైల్లో బ్యాటింగ్ విధ్వంసం రేపుతానంటున్నాడు. 

35
చిత్ర సౌజన్యం: ANI

3. రషీద్ ఖాన్

జట్టు: గుజరాత్ (గుజరాత్ టైటాన్స్)

రషీద్ ఖాన్ టీ20 క్రికెట్‌లో ప్రపంచంలోని టాప్ బౌలింగ్ ఆల్‌రౌండర్. గుజరాత్ టైటాన్స్ జట్టులోని కీలక ప్లేయర్. బౌలింగ్ తో పాటు తనదైన బ్యాటింగ్ తో ఐపీఎల్ 2025లో అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తానని చెబుతున్నాడు.

45

4. ట్రావిస్ హెడ్

జట్టు: ఎస్ఆర్హెచ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

ట్రావిస్ హెడ్ ప్రత్యర్థి జట్లకు హెడేక్. అతను చెలరేగి ఆడితే ఎంతటి బౌలర్లకు అయినా కష్టాలు తప్పవు. గత సీజన్ లో దుమ్మురేపే ఇన్నింగ్స్ లను ఆడటంతో హైదరాబాద్ టీమ్ భారీ స్కోర్లు నమోదుచేసింది. ఈ సారి సునామీ ఇన్నింగ్స్ లతో సన్‌రైజర్స్ జట్టుకు 300+ పరుగుల మార్కును అందించాలని ట్రావిస్ హెడ్ టార్గెట్ గా పెట్టుకున్నాడు.

55

5. మిచెల్ స్టార్క్

జట్టు: కేకేఆర్ (కోల్ కతా నైట్ రైడర్స్)

గత వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ రికార్డు సాధించాడు. కేకేఆర్ ట్రోఫీ గెలవడానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈసారి కూడా తన కచ్చితమైన బౌలింగ్‌తో అదరగొడతానంటున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories