2020 సీజన్ ఆరంభానికి ముందు ధోనీతో పాటు ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్నాడు సురేష్ రైనా.... మాహీతో పాటు బయో బబుల్‌లో గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

అయితే 2020 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే సురేష్ రైనా మామ ఇంటిపై దుండగలు దాడి చేసి, హత్య చేయడంతో అర్ధాంతరంగా స్వదేశం చేరుకున్నాడు. హఠాత్ సంఘటన కారణంగా ఇంటి పెద్దను కోల్పోయిన భార్య కుటుంబానికి తోడుగా నిలిచాడు.

మామ గారి ఇంటిపై దాడి చేసి, హత్య చేసిన దుండగులను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత సురేష్ రైనా, తిరిగి వచ్చి చెన్నై టీమ్‌తో కలుస్తాడని భావించారంతా. కానీ రైనా అలా చేయలేదు.

సురేష్ రైనా మాదిరిగానే దుబాయ్ చేరిన సీఎస్‌కే సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్... తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఇద్దరు సీనియర్లు ప్లేయర్లు లేకపోవడంతో బాగా ఇబ్బంది పడింది చెన్నై సూపర్ కింగ్స్.

సీజన్ మొత్తానికి దూరమైన కారణంగా ఐపీఎల్ నిబంధనల ప్రకారం సురేష్ రైనా, హర్భజన్ సింగ్‌లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్..

దీంతో వచ్చే సీజన్‌లో సురేష్ రైనా, హర్బజన్ సింగ్ ఐపీఎల్ వేలంలో పాల్గొనబోతున్నారు. ‘మిస్టర్ ఐపీఎల్’గా పేరొందిన సురేష్ రైనా కోసం మిగిలిన జట్లు కోసం భారీ ధర చెల్లించేందుకు ముందుకు రావచ్చు.

ఇప్పటికే ధోనీపై కామెంట్లు చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన హర్భజన్ సింగ్ తిరిగి చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడడానికి ఏ మాత్రం సుముఖంగా లేదని టాక్ వినిపిస్తోంది. తిరిగి తన పాత జట్టు ముంబైలో చేరాలని భజ్జీ భావిస్తున్నాడట.

మరోవైపు సురేష్ రైనా మాత్రం ఓ అభిమాని... ‘వచ్చే సీజన్‌లో వేరే జట్టులోకి వెళతారా?’ అని అడిగిన ప్రశ్నకి సమాధానంగా ‘ఎప్పటికీ ఎల్లో జెర్సీనే’ అనే సమాధానం ఇచ్చాడు. అయితే ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి కావడం ఇష్టం లేకనే రైనా అలా చెప్పి ఉంటాడని అని చెప్పేవాళ్లు లేకపోలేదు.

గుజరాజ్ కెప్టెన్‌గా 2016లో జట్టును ప్లేఆఫ్ చేర్చిన సురేష్ రైనా, రాజస్థాన్ రాయల్స్ జట్టుకి కెప్టెన్‌గా చేయాలని ఆశపడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. స్టీవ్ స్మిత్, అజింకా రహానే వంటి కెప్టెన్లు విఫలం కావడంతో సరైన సారథి కోసం వెతుకుతోంది ఆర్ఆర్.

‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా అయితే జట్టును విజయతీరాలకు చేర్చగలడని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోందట. మరి సురేష్ రైనా సీఎస్‌కేలోకి వెళ్లి వైస్- కెప్టెన్‌గానే కొనసాగుతాడా? లేక ఆర్ఆర్‌లోకి వెళ్లి కెప్టెన్ అవుతాడా? అనేది తేలాలంటే వచ్చే ఏడాది ఐపీఎల్ వేలం దాకా ఆగాల్సిందే.

అయితే మహేంద్ర సింగ్ ధోనీకి ప్రీతిపాత్రుడిగా, మంచి స్నేహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా... ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన రోజే తాను కూడా మాహీ అనుసరిస్తున్నానంటూ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు.

అలాంటి రైనా, ధోనీ జట్టును కాదని వేరే టీమ్‌లోకి వెళతాడా? అని వాదిస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. రైనా అభిమానులు మాత్రం తనని కెప్టెన్‌గా చూడాలని కోరుకుంటున్నారు.