తేజశ్వి యాదవ్ ఐపీఎల్‌ ఆడాడు... బీహార్ నుంచి ఏ జట్టుకు ఆడాడో తెలుసా...

First Published Nov 7, 2020, 10:04 PM IST

బీహార్ ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలన్నీ లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజశ్వి యాదవ్‌కి అనుకూలంగా వచ్చాయి. బీహార్‌కి కాబోయే ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్‌ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్న తేజశ్వి... ఐపీఎల్ ఆడాడని తెలుసా. అవును... ఐపీఎల్‌లో నాలుగేళ్ల పాటు కొనసాగాడు తేజశ్వి.

చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడిన తేజశ్వి యాదవ్... 19 ఏళ్ల నుంచి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడాడు.
undefined
లల్లూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో 2009లో 35 లక్షల రూపాయలకు తేజశ్వి యాదవ్‌ను కొనుగోలు చేసింది ఢిల్లీ డేర్‌డెవిల్స్...
undefined
2009లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడని తేజశ్వి యాదవ్... 2010లో కూడా అదే జట్టుతో కొనసాగాడు...
undefined
2009 నుంచి 2012 దాకా ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో భాగమైన తేజశ్వి యాదవ్‌కి ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కలేదు... 2012లో ఐపీఎల్‌ను ఫిక్సింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చిన సమయంలో పార్లమెంటులో ఈ విషయం చర్చకి వచ్చినప్పుడులల్లూ ప్రసాద్ యాదవ్... ‘నా కొడుకు ఐపీఎల్ ఆడుతున్నాడు. కానీ ఆటగాళ్లకి వాటర్ బాటిళ్లు ఇవ్వడం తప్ప ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు’ అని చెప్పాడు.
undefined
నాలుగు సీజన్లు ఎదురుచూసినా ఒక్క అవకాశం కూడా దక్కకపోవడంతో నిరాశ చెందిన లల్లూ కుమారుడు.. క్రికెట్ కెరీర్‌కి గుడ్‌బై చెప్పి రాజకీయాలవైపు ఫుల్లు ఫోకస్ మలిపాడు.
undefined
ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయినా ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఇందులో మొదటి ఇన్నింగ్స్‌లో 1 పరుగుకే అవుటైన తేజశ్వి యాదవ్, రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేశాడు.
undefined
లిస్టు ఏ క్రికెట్‌లో 2 మ్యాచులు ఆడిన తేజశ్వి యాదవ్... కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 9 పరుగులు. బౌలింగ్‌లో ఓ వికెట్ తీశాడు తేజస్వి యాదవ్.
undefined
నాలుగు టీ20 మ్యాచులు ఆడిన తేజస్వి యాదవ్... ఒకే ఒక్క మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి వచ్చి 3 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు....
undefined
ఎన్నో మ్యాచులు ఆడి, నిలకడైన ప్రదర్శన ఇస్తున్నవారికి కూడా దక్కని అవకాశం తేజశ్వి యాదవ్‌కి ఎలా దక్కిందనేదానిపై అందరికీ స్పష్టమైన క్లారిటీ ఉంది.లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు కావడంతో టీమ్‌లో నుంచి తీసేయడానికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ సాహసించలేదు... అయితే జట్టులో ఉన్న సమయంలో కూడా ఆలస్యంగా ప్రాక్టీస్‌కి వచ్చేవాడు తేజశ్వి యాదవ్..
undefined
2010లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రాక్టీస్ క్యాంప్ మొదలైన నాలుగురోజుల తర్వాత జట్టుతో కలిసాడు తేజశ్వి యాదవ్. కారణం అడిగితే ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడం వల్ల రాలేకపోయానని చెప్పాడట బీహార్ రాష్ట్రానికి కాబోయే సీఎం.
undefined
click me!