ఓపెనింగ్ నుంచి ఫినిషర్ వరకూ ఎక్కడైనా ఓకే.. కానీ నా ఫేవరైట్ పొజిషన్ మాత్రం అదే : సూర్యకుమార్ యాదవ్

Published : Sep 18, 2022, 04:30 PM IST

Suryakumar Yadav: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లలో భారత్ కు దొరికన ఓ ఆణిముత్యం. గడిచిన ఏడాదికాలంగా సూర్య కీలక ఇన్నింగ్స్ లు ఆడి  భారత విజయాల్లో భాగమవుతున్నాడు. 

PREV
18
ఓపెనింగ్ నుంచి ఫినిషర్ వరకూ ఎక్కడైనా ఓకే.. కానీ నా ఫేవరైట్ పొజిషన్ మాత్రం అదే : సూర్యకుమార్ యాదవ్

అభిమానులంతా  ‘నయా 360’, ‘సూర్యాభాయ్’ అని పిలుచుకునే టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ టీ20లలో భారత్ కు కీలక ఆటగాడు.  2021లో  జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య.. ఆనతికాలంలోనే జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.  

28
Image credit: Getty

ఈ ఏడాది కాలంలో భారత నెంబర్ వన్ టీ20 బ్యాటర్ గా ఎదిగిన  సూర్యా భాయ్.. 14 టీ20లలో 35 సగటుతో  460 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 179గా ఉంది. ప్రస్తుత భారత క్రికెట్ లో మరే క్రికెటర్ కు కూడా ఈ స్థాయిలో స్ట్రైక్ రేట్ లేదు. 

38

అయితే రాబోయే టీ20 ప్రపంచకప్ లో సూర్య ఎక్కడ ఆడితే బాగుంటుంది..? టీమిండియా అతడిని ఎలా ఉపయోగించుకోనుంది..? అని చర్చలు సాగుతున్న వేళ సూర్య ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో తనకు ఏ స్థానం ఇష్టమో తెలిపాడు. 

48

సూర్య మాట్లాడుతూ.. ‘నేను ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలుగుతా.. 1,3, 4, 5.. ఇలా ఏ పొజిషన్ లో అయినా  బ్యాటింగ్ కు వస్తా.  నాకు వ్యక్తిగతంగా అయితే నాలుగో స్థానం అంటే చాలా ఇష్టం. అంతేగాక అది నాకు చాలా సూట్ అవుతుందని నేను భావిస్తాను.   నేను బ్యాటింగ్ కు వెళ్లే నాలుగో స్థానం ఆటను నియంత్రించేలా చేస్తుంది.  

58

ముఖ్యంగా టీ20లలో 8-14 ఓవర్లు చాలా కీలకం.  ఆ సమయంలో బ్యాటింగ్ చేసేప్పుడు నేను సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తా.  ఆ  టైంలో నేను  ఎక్కువగా రిస్కీ షాట్స్ ఆడను.  అది చాలా సవాలుతో కూడుకున్న పొజిషన్ అయినా  అక్కడ బ్యాటింగ్ చేయడం భలే మజాగా ఉంటుంది. 

68

నేను పవర్ ప్లేలో దుమ్ము దులిపి.. చివరి ఓవర్లలో భీకర బ్యాటింగ్ తో భారీ స్కోర్లు చేసిన గేమ్స్ చాలా చూశాను. కానీ టీ20లలో మిడిల్ ఓవర్స్ చాలా ముఖ్యం.  8-14 ఓవర్ల మధ్య ఆటను ముందుకు తీసుకెళ్లడానికి  కీలక సమయం.  అప్పుడు నేను ఎక్కువగా ఓవర్ కవర్స్, పాయింట్  లో ఆడేందుకు ప్రయత్నిస్తా. 

78

ఫోర్లు, సిక్సర్లే గాక  మిడిల్ ఓవర్లలో వికెట్ల మధ్య పరిగెత్తడం ముఖ్యం.  మిడిల్ ఓవర్స్ లో బాగా ఆడితేనే చివర్లో వచ్చే ఫినిషర్ తన పాత్రకు న్యాయం చేయగలుగుతాడు.   మంచి ఇన్నింగ్స్ నిర్మిస్తే ఫినిషర్ దానికి ఫినిషింగ్ టచ్ ఇస్తాడు..’ అని తెలిపాడు. 

88

టీమిండియాలోకి వచ్చినప్పట్నుంచీ  నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్న సూర్య ఇటీవల కాలంలో పొజిషన్ మారుతున్నాడు. వెస్టిండీస్ సిరీస్ లో  రోహిత్ తో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగాడు.  మళ్లీ ఆసియా కప్ లో నాలుగో స్థానానికే వెళ్లిపోయాడు. టీ20 ప్రపంచకప్ లో రాహుల్ ను కాకుండా   కోహ్లీ లేదా రిషభ్ ను ఓపెనర్ గా బరిలోకి దింపితే సూర్య  వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చే అవకాశముందని.. అది భారత జట్టుకు మంచి చేస్తుందని చర్చలు  జరుగుతున్న వేళ సూర్య ఈ కామెంట్స్ చేయడం గమనార్హం. 

click me!

Recommended Stories