ఆసియా కప్ 2022లో టీమిండియా గెలిచిన మొదటి రెండు మ్యాచుల్లో ఆడిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఆ తర్వాత గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గాయానికి శస్త్ర చికిత్స పూర్తైనప్పటికీ రవీంద్ర జడేజా కోలుకోవడానికి మూడు నెలల వరకూ సమయం పడుతుందని వైద్యులు తేల్చేశారు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులోనూ రవీంద్ర జడేజాకి చోటు దక్కలేదు...
ఆసియా కప్ 2022 టోర్నీ సమయంలో ఓ వాటర్ అడ్వెంచర్‌లో పాల్గొన్న రవీంద్ర జడేజా, స్కైబోర్డు నుంచి కిందపడడంతో అతని మోకాలికి తీవ్ర గాయమైందని సమాచారం. ఈ గాయానికి చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైందని జడ్డూ ప్రకటించాడు. అయితే ఇప్పుడిప్పుడే వీల్ ఛైయిర్ నుంచి నిలబడేందుకు కష్టపడుతున్న జడేజా... మరో మూడు నెలల వరకూ క్రికెట్‌కి దూరమయ్యాడు...
27
jadeja
గాయపడిన రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌ని ఎంపిక చేసింది టీమిండియా. అలాగే దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యాలకు ఆల్‌రౌండర్లుగా టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు దక్కింది. అయితే జడ్డూ లేని లోటు టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని అంటున్నాడు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్థనే...
37
Ravindra Jadeja
‘టీమిండియాకి ఐదో స్థానంలో రవీంద్ర జడేజా పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆరో స్థానంలో హార్ధిక్ పాండ్యాతో కలిసి మంచి ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. ఈ ఇద్దరూ భారత జట్టుకి బ్యాటింగ్ ఆర్డర్‌లో విలువైన పరుగులు జోడిస్తున్నారు...
47
jadeja
జడేజా లాంటి లెఫ్ట్ హ్యాండ్ ఆల్‌రౌండర్ లేకపోవడం ఏ జట్టుకైనా తీరని లోటే. ఎందుకంటే జడేజా లాంటి ప్లేయర్లు దొరకడమే చాలా అరుదు. దినేశ్ కార్తీక్, మంచి హిట్టర్. అయితే అతన్ని పక్కనబెట్టి రిషబ్ పంత్‌ని ఆడించారు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌కి పెద్దగా సమయం లేదు...
57
తక్కువ సమయంలో ఐదో స్థానంలో ఎవరిని ఆడించాలనే విషయంపై టీమిండియాకి స్పష్టత రావాలి. జడేజా లేని లోటు తెలియకుండా రాణించగల ప్లేయర్‌ని వెతికి పట్టుకోవడం చాలా కష్టమైన పనే...
67
Image Credit: Anushka Sharma Instagram
విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు, సెంచరీ చేసి టీమ్‌లోని మిగిలిన ప్లేయర్లలో ఆత్మవిశ్వాసం నింపాడు. కోహ్లీ లాంటి సీనియర్, కాన్ఫిడెంట్‌గా పరుగులు చేస్తుంటే... మిగిలిన ప్లేయర్లు స్వేచ్ఛగా ఆడడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది...
77
bumrah
జస్ప్రిత్ బుమ్రా లేకపోవడం ఆసియా కప్‌లో టీమిండియాపై ప్రభావం చూపించింది. అతను కొత్త బంతితో అద్భుతాలు చేస్తాడు, డెత్ ఓవర్లలో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చి.. చాలా ఖాళీలను పూరిస్తాడు. వరల్డ్ కప్‌లో బెస్ట్ క్రికెట్ చూస్తామనే ఆశిస్తున్నా.. ’ అంటూ కామెంట్ చేశాడు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్థనే..