టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. మరో నెల రోజుల్లో 8వ ఎడిషన్ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 2007లో ప్రారంభమైన పొట్టి ప్రపంచకప్, టీ20 ఫార్మాట్‌కి అమితమైన ఆదరణ దక్కడానికి కారణమైంది. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 ద్వారా భారత కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్... ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేయబోతున్నారు...
2007లో సౌతాఫ్రికా వేదికగా మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ జరిగింది. ఈ టోర్నీలో అండర్ డాగ్స్‌గా బరిలో దిగిన భారత జట్టు, అద్వితీయ విజయాలతో టైటిల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఎడిషన్‌లో టీమిండియా తరుపున బరిలో దిగిన దినేశ్ కార్తీక్, రోహిత్ శర్మ... 15 ఏళ్ల తర్వాత జరగబోయే టీ20 వరల్డ్ కప్ 2022 ఎడిషన్‌లోనూ ఆడబోతున్నారు...
27
rohit sharma
అయితే దినేశ్ కార్తీక్ 2007టీ20 వరల్డ్ కప్ తర్వాత 2009 టీ20 వరల్డ్ కప్‌లో రిప్లేస్‌మెంట్‌గా ఆడిన దినేశ్ కార్తీక్, 2010 టీ20 వరల్డ్ కప్‌లోనూ ఆడాడు. ఆ తర్వాత 2012, 2014, 2016, 2021 ఎడిషన్లలో చోటు దక్కించుకోలేకపోయాడు. 2007 నుంచి ప్రతీ టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లోనూ ఆడిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు రోహిత్ శర్మ...
రోహిత్ శర్మతో పాటు బంగ్లా ఆల్‌రౌండర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా 2007 నుంచి ప్రతీ టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లోనూ ఆడాడు. తన కెరీర్‌లో 99 టీ20 మ్యాచులు ఆడిన షకీబ్ అల్ హసన్‌పైన బంగ్లా భారీ ఆశలే పెట్టుకుంది...
57
Image Credit: Getty Images
2021 టీ20 వరల్డ్ కప్ వరకూ జరిగిన ప్రతీ ఎడిషన్‌లోనూ ఆడిన నలుగురు ప్లేయర్లు, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. వెస్టిండీస్ హిట్టర్ ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్‌తో పాటు విండీస్ ఆల్‌రౌండర్ డీజే బ్రావో కూడా మొదటి ఏడు ఎడిషన్లలోనూ పాల్గొన్నారు...
67
బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు క్రిస్ గేల్. అధికారికంగా ప్రకటించకపోయినా క్రిస్ గేల్ కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్టే...
77
mushfiqur rahim
బంగ్లా వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్, 2007 నుంచి 2021 వరకూ ప్రతీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆడాడు. నెల రోజుల క్రితం టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు ముష్ఫికర్ రహీమ్. అలాగే మొదటి ఏడు ఎడిషన్లు ఆడిన బంగ్లా ఆల్‌రౌండర్ మహ్మదుల్లాకి ఈసారి టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు దక్కలేదు.