సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో 22 మంది... స్టార్లను అట్టిపెట్టుకున్న ఎస్ఆర్‌హెచ్...

First Published Jan 21, 2021, 12:55 PM IST

IPL 2021 సీజన్‌కి ముందు జట్టులో పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడలేదు సన్‌రైజర్స్ హైదరాబాద్. 2020 ఐపీఎల్ సీజన్‌లో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్, పాత జట్టును కొనసాగించడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోంది. గత సీజన్‌లో పెద్దగా అవకాశం రాని, రిజర్వు బెంచ్‌కే పరిమితమైన ఐదుగురు క్రికెటర్లను మాత్రమే ఐపీఎల్ 2021 మినీ వేలానికి వదిలేసింది సన్‌రైజర్స్.

తమిళనాడు యువ ప్లేయర్ సంజయ్ యాదవ్, తెలుగు ప్లేయర్లు బి సందీప్, ఎర్రా పృథ్వీరాజ్‌లను వేలానికి వదిలిన సన్‌రైజర్స్ బిల్లీ స్టాన్‌లేక్, ఫాబియన్ ఆలెన్‌ను రిలీజ్ చేసింది.
undefined
2021 ఐపీఎల్ సీజన్‌కి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహారించే అవకాశం ఎక్కువగా ఉంది...
undefined
అతనితో పాటు కేన్ విలియంసన్, జానీ బెయిర్ స్టోలను అట్టిపెట్టుకుంది సన్‌రైజర్స్. 2020 సీజన్‌లో విఫలమైన బెయిర్ స్టోను కూడా మినీ వేలానికి వదల్లేదు సన్‌రైజర్స్...
undefined
యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మతో పాటు మనీశ్ పాండే, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, సందీప్ శర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీ ప్లేయర్లుగా ఉండబోతున్నారు.
undefined
యంగ్ బ్యాట్స్‌మెన్ శ్రీవాస్తవ్ గోస్వామి, సిద్ధార్థ్ కౌల్, టి నటరాజన్, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహాలను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది.
undefined
వీరితో పాటు ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, ప్రియమ్ గార్గ్, విరాట్ సింగ్, ఖలీల్ అహ్మద్, షాబద్ నదీమ్ సన్‌రైజర్స్ జట్టులో ఉన్నారు.
undefined
గత సీజన్‌లో గాయం కారణంగా మధ్యలో తప్పుకున్న భువనేశ్వర్ కుమార్, మిచెల్ మార్ష్‌‌లను కూడా 2021 సీజన్‌లో కొనసాగించనుంది సన్‌రైజర్స్...
undefined
వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. ప్రతీ జట్టు కూడా ఇద్దరు విదేశీ ప్లేయర్లను, ముగ్గురు స్వదేశీ ప్లేయర్లను మినహా మిగిలిన జట్టునంతా వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది. దాంతో ఈ ఏడాది మరోసారి పాత జట్టునే కొనసాగించాలని చూస్తోంది సన్‌రైజర్స్...
undefined
స్టార్లు మొత్తం వెంటే ఉండడం, పర్సులో రూ.10 కోట్లకు పైగా సొమ్ము ఉండడంతో ఈసారి మినీ వేలంలో స్టార్లను కొనుగోలు చేసేందుకు సన్‌రైజర్స్ పెద్దగా పోటీపడకపోవచ్చు.
undefined
మహా అయితే ఈ వేలంలో ఓ ఆల్‌రౌండర్‌ను, ఓ డెత్ ఓవర్ బౌలర్‌ను కొనుగోలు చేయాలని చూస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
undefined
click me!