‘స్పైడర్ మ్యాన్’ రిషబ్ పంత్... భారత యంగ్ వికెట్ కీపర్‌పై ఐసీసీ ఫన్నీ ఫోటో, కవిత్వం...

First Published Jan 21, 2021, 11:24 AM IST

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై పరుగులు సాధించడం అంటే... అంత తేలికైన పనికాదు. స్వదేశంలో పుల్లుల్లా గర్జించిన ఎందరో లెజెండరీ ప్లేయర్లు, ఆసీస్ గడ్డపై ఘోరంగా ఫెయిల్ అయ్యారు. అయితే భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం అక్కడ రికార్డు ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆడిన 12 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు 25+ స్కోరు నమోదుచేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్, నాలుగో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో టాప్ క్లాస్ ప్రదర్శనతో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. పంత్‌ను పొగుడుతూ ఓ ఫన్నీ ఫోటో, కవిత్వాన్ని పోస్టు చేసింది ఐసీసీ.

టీమిండియా తరుపున అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషబ్ పంత్.... అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన వికెట్ కీపర్‌గానూ నిలిచాడు.
undefined
మొదటి టెస్టులో చోటు దక్కించుకోని రిషబ్ పంత్, ఆ తర్వాత ఆడిన మూడు టెస్టుల్లో 274 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు...
undefined
ఐదు ఇన్నింగ్స్‌ల్లో 274 పరుగులు చేసిన రిషబ్ పంత్, అత్యధిక స్కోరు 97 పరుగులు. సిడ్నీ టెస్టులో పంత్ చేసిన 97 పరుగుల ఇన్నింగ్స్‌... ఆస్ట్రేలియా బౌలర్ల గుండెల్లో గుబులు రేకేత్తించింది.
undefined
ఆస్ట్రేలియాకి 32 ఏళ్లుగా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న గబ్బాలో నాలుగో ఇన్నింగ్స్‌లో 138 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేసిన రిషబ్ పంత్, భారత జట్టుకి చారిత్రక విజయాన్ని అందించాడు.
undefined
బ్యాటింగ్‌లోనే కాకుండా వికెట్ల వెనకాల ఫన్నీ కామెంటరీతో కూడా ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించాడు రిషబ్ పంత్. గత ఆసీస్ పర్యటనలో తన సెడ్జింగ్‌తో ఆసీస్‌కు వణుకు పుట్టించిన రిషబ్ పంత్, ఈసారి డోస్ తగ్గించినా ఫన్నీ కామెంట్లతో ఆకట్టుకున్నాడు.
undefined
ముఖ్యంగా నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.... ‘స్పైడర్ మ్యాన్... స్పైడర్ మ్యాన్... తూనే చురాయ మేరా దిల్ కా చైన్’ అంటూ రిషబ్ పంత్ పాడిన పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది...
undefined
గబ్బా టెస్టు విజయం తర్వాత భారత మాజీ ఓపెనర్, వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే పాటను కామెంట్ చేసి, రిషబ్ పంత్‌ను ఆకాశానికి ఎత్తేశాడు...
undefined
ఇప్పుడు ఐసీసీ కూడా ఇదే పాటతో స్పైడర్ మ్యాన్ గెటప్‌లో కాళ్లకు కీపింగ్ గార్డ్స్‌తో ఉన్న రిషబ్ పంత్ ఫోటోను ట్వీట్ చేసింది...
undefined
‘స్పైడర్ పంత్... స్పైడర్ పంత్... ఈ స్పైడర్ ఏదైనా చేయగలడు... సిక్సర్లు కొట్టగలడు... క్యాచులు అందుకోగలడు... టీమిండియాకి విజయాన్ని అందించగలడు... ఇది వచ్చేశాడు స్పైడర్ పంత్’ అంటూ పాట రూపంలో ఓ ఫన్నీ కవిత్వాన్ని పోస్టు చేసింది ఐసీసీ...
undefined
సిడ్నీలో 97 పరుగులు, బ్రిస్బేన్‌లో 89 పరుగులతో పాటు ఆసీస్ టూర్‌లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు...
undefined
తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్‌కి 13వ ర్యాంకు దక్కింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లలో రిషబ్ పంత్‌దే బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం.
undefined
click me!