ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో షార్ట్ రన్ కారణంగా ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆఖరి బంతిదాకా పోరాడిన విధానంతో ఆకట్టుకుంది. అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు పూర్తిగా చేతులు ఎత్తేశారు..
రషీద్ ఖాన్ ఒక్కడు మూడు వికెట్లు తీయగా మిగిలిన బౌలర్లు ఎవ్వరూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. నటరాజన్‌తో పాటు భువనేశ్వర్ కుమార్ గాయపడడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
అయితే వరుసగా మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నా... ప్రాక్టీస్ సెషన్స్‌ను ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆరెంజ్ ఆర్మీ విడుదల చేస్తున్న ఫోటోలే ఇందుకు ప్రత్యేక్ష సాక్ష్యం.
వరుస మ్యాచుల్లో ఎదురైన పరాభవం నుంచి ఆటగాళ్లు తేరుకోవాలనో, లేక మనోళ్లు బాగా ఆడి ఆడి అలసిపోయారు... కాస్త ఆటవిడుపు కావాలని భావించారో ఏమో కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్, ఆటగాళ్లతో సరదా సరదా ఆటలు ఆడించింది.
రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్, కేన్ విలియంసన్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లంతా బాల్ పగలకుండా ట్రైన్ ఆట, నోటితో బిస్కెట్ అందుకునే ఆటతో పాటు రకరకాల ఫన్నీ ఆటలు ఆడుతూ కనిపించారు.
వీటితో పాటు వాటర్ వాలీబాల్ వంటి ఆటలు ఆడుతూ అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు. అరే... ఓ వైపు మ్యాచులు ఓడిపోతే, కేన్ విలియంసన్, బెయిర్ స్టో, రషీద్ ఖాన్ తప్ప మిగిలిన ప్లేయర్లు సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేక ఇబ్బందిపడుతుంటే, ప్రాక్టీస్ వదిలేసి ఈ ఆటలేంటని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు.
ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడబోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది. రాయల్స్ కూడా వరుసగా మ్యాచులు ఓడిపోతున్నా, సన్‌రైజర్స్‌తో పోలిస్తే ఆ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎక్కువే...
మంచి ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్‌ను ఓడించాలంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మొత్తం అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనోళ్లు ఇలా వాలీబాల్, ట్రైన్ ఆటలు ఆడుతూ ఉంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇక అస్సాం ట్రైయిన్ ఎక్కుతుందని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు...