సీజన్ మారింది, టీమ్ మారింది! పర్పామెన్స్ మాత్రం మారలే.. కావ్య పాపను ఏడిపించడమూ మారలే...

Published : Apr 02, 2023, 08:26 PM IST

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మంచి రికార్డు ఉంది. రెండు సార్లు ఫైనల్ చేరిన సన్‌రైజర్స్, 2016లో టైటిల్ విజేతగా నిలిచింది. ఐదుసార్లు ప్లేఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్... గత రెండు సీజన్లలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సీజన్‌ని కూడా ఘోర పరాజయంతో మొదలెట్టింది సన్‌రైజర్స్...

PREV
17
సీజన్ మారింది, టీమ్ మారింది!  పర్పామెన్స్ మాత్రం మారలే.. కావ్య పాపను ఏడిపించడమూ మారలే...

స్టార్ ప్లేయర్లు లేకపోయినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏబీ డివిల్లియర్స్, దినేశ్ కార్తీక్ వంటి క్రికెటర్లు కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరుతుందని అంచనా వేశారు. అయితే ఐపీఎల్ 2021 సీజన్ నుంచి సన్‌ రైజింగ్ కావడం లేదు...

27
Image credit: PTI

2021 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి స్థానంలో నిలిచింది. 2022 సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చినా అదే జోరు చూపించలేకపోయింది... 

37
SRH vs RR

2023 సీజన్‌లోనూ సన్‌రైజర్స్‌కి శుభారంభం దక్కలేదు. 2023 ఐపీఎల్ సీజన్‌లో జరిగిన మొదటి మూడు మ్యాచుల్లో హోం గ్రౌండ్‌లో ఆడిన టీమ్స్‌నే విజయం వరించింది. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్, మొహాలీలో పంజాబ్ కింగ్స్, లక్నోలో లక్నో సూపర్ జెయింట్స్ విజయాలు అందుకున్నాయి..

47

అయితే హైదరాబాద్ విషయంలో మాత్రం ఇది కూడా వర్కవుట్ కాలేదు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 72 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది ఆరెంజ్ ఆర్మీ. మొదటి మ్యాచ్‌లో ఓడడం పెద్ద తప్పేమీ కాదు. తొలి మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన వచ్చిన పెద్ద నష్టమేమీ లేదు...
 

57

తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన టీమ్స్, ఆ తర్వాత వరుస విజయాలతో ఫైనల్ చేరి టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచిన ప్రతీసారీ, తొలి మ్యాచ్‌లో ఓడింది. అయితే సన్‌రైజర్స్ ఓడిన విధానమే ప్రధాన సమస్య...

67

బౌలర్లు 203 పరుగుల భారీ స్కోరు ఇచ్చిన తర్వాత సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 95 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కోట్లు పెట్టి కొన్న హారీ బ్రూక్ కానీ ఆదుకుంటాడనుకున్న మయాంక్ అగర్వాల్ కానీ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయారు. తర్వాతి మ్యాచ్‌లో కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ దిగుతున్నాడు..

77

అయిడిన్ మార్క్‌రమ్ ఒక్కడూ వస్తే ఈ టీమ్ గాడిలో పడుతుందా? తొలి మ్యాచ్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకొని, సన్‌ ‘రైజ్’ అవుతుందా? అంటే చెప్పడం కష్టం. సన్‌రైజర్స్ హైదరాబాద్ కంటే యజమాని కావ్య మారన్‌ ముఖంలో వీళ్ల ఆట చూసి చిరాకు, అసహనం, బాధ... ఆమె డై హార్ట్ ఫ్యాన్స్‌ని ఎక్కువ కష్టపెడుతున్నాయి. కనీసం ఆమె కోసమైనా మనోళ్లు మంచి పర్ఫామెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మీమర్స్.. 
 

click me!

Recommended Stories