రుతురాజ్ గైక్వాడ్, టీమిండియాలో అద్భుతాలు చేస్తాడు... - గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

Published : Apr 02, 2023, 06:51 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మొదటి పరుగు, మొదటి బౌండరీ, మొదటి సిక్సర్, మొదటి హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు రుతురాజ్ గైక్వాడ్. 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు...

PREV
15
రుతురాజ్ గైక్వాడ్, టీమిండియాలో అద్భుతాలు చేస్తాడు... - గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...
Ruturaj Gaikwad

ఐపీఎల్ 2021 సీజన్‌లో 635 పరుగులు చేసి, అతి పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన రుతురాజ్ గైక్వాడ్, 2022 సీజన్‌లో 368 పరుగులు చేసి చెన్నై తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు..

25
Image credit: PTI

‘ఒకానొక దశలో చెన్నై సూపర్ కింగ్స్ 220-230 పరుగులు చేస్తుందని అనుకున్నా. రుతురాజ్‌ గైక్వాడ్‌కి ఏ ఏరియాలో బౌలింగ్ చేయాలో అర్థం కాలేదు. అతను ఈ రోజు సెంచరీ చేస్తాడు? రుతురాజ్‌ని అవుట్ చేయలేం అనుకున్నా...

35
Image credit: PTI

లక్కీగా సెంచరీకి ముందు అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ ఆడిన ప్రతీ షాట్ కూడా మంచి బాల్స్‌కి వచ్చినవే. కొన్ని షాట్స్ చూసి నేనే ఇంప్రెస్ అయిపోయా.. అతను బ్యాటింగ్ వల్లే మా బౌలర్లు కూడా ఆరంభంలో ఎక్కువ పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది.

45
Ruturaj Gaikwad

అతను టీమిండియా ఫ్యూచర్. నా అంచనా ప్రకారం భారత క్రికెట్‌లో అతను అద్భుతాలు చేస్తాడు. గేమ్‌ని ఎలా మార్చాలో రుతురాజ్‌కి బాగా తెలుసు. టీమిండియాలో అతనికి టైం వస్తుంది. అప్పుడు ఎవ్వరూ అతని స్థానాన్ని లాక్కోలేరు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...

55

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్, అద్భుత ఆటతీరుతో టైటిల్ విజేతగా నిలిచింది. 2023 సీజన్ తొలి మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది గుజరాత్ టైటాన్స్.. 

click me!

Recommended Stories