అదరగొట్టావ్ నట్టూ... నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది... ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్...

First Published Jan 24, 2021, 9:49 AM IST

భారతీయులకు, అందులోనూ ముఖ్యంగా తెలుగువారికి బాగా దగ్గరైన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా, టిక్ టాక్ స్టార్‌గా ఇక్కడ తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు వార్నర్ భాయ్. ఆడిలైడ్‌లో టీమిండియా ఓటమి తర్వాత, గబ్బాలో టెస్టు సిరీస్ కోల్పోయిన తర్వాత వార్నర్ స్పందించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది...

ఐపీఎల్ 2020 సీజన్‌లో నెట్స్‌లో అదరగొట్టిన నటరాజన్‌ను అద్భుతంగా వాడుకున్నాడు సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...
undefined
చాలా ఏళ్ల తర్వాత అందివచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఒడిసి పట్టుకున్న నట్టూ... యార్కర్లతో ప్రత్యర్థిని బెదరకొట్టి, సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు...
undefined
మొదట ఆస్ట్రేలియా టూర్‌కి నెట్ బౌలర్‌గా... ఆ తర్వాత టీ20 సిరీస్‌కి ఎంపికైన నటరాజన్... వన్డే, టీ20, టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు..
undefined
ఆస్ట్రేలియా టూర్ ప్రారంభానికి ముందే నటరాజన్‌కి అభినందనలు తెలిపిన డేవిడ్ వార్నర్... ఆసీస్ టూర్‌లో అతను అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు...
undefined
తాజాగా ఆసీస్ టూర్‌లో అద్భుతంగా మెరిసిన నటరాజన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడు డేవిడ్ భాయ్... ‘నట్టూ చాలా జీనియస్ ప్లేయర్... ఐపీఎల్‌లో ఆడినప్పుడు నీ గురించి నేను ఏదైనా అనుకున్నానో దాన్ని నిలబెట్టుకున్నావు...
undefined
మ్యాచ్ వరకూ మాత్రమే మేమిద్దరం ప్రత్యర్థులం. బయట ఎప్పుడూ మంచి స్నేహితులమే... నీ నిజాయితీ నాకెంతో ఇష్టం... నీకు కెప్టెన్ అయినందుకు గర్వపడుతున్నా...
undefined
చాలామంది బౌలర్లు వికెట్ తీయగానే గర్వంతో ఊగిపోతారు... కానీ నువ్వు వికెట్ పడగొట్టినా హుందాగా ఉండేందుకే ప్రయత్నిస్తావు...’ అంటూ చెప్పుకొచ్చాడు.
undefined
భారత జట్టులోకి మెరుపు వేగంతో దూసుకొచ్చిన నటరాజన్, భవిష్యత్తులో మరో బుమ్రాలా ఎదుగుతాడని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు... అతన్ని సరిగ్గా వాడుకోవాల్సిన బాధ్యత సెలక్టర్లపైనే ఉందంటున్నారు...
undefined
ఐపీఎల్ సమయంలోనే ఓ ఆడబిడ్డకు తండ్రి అయ్యాడు నటరాజన్. అయితే జట్టు కోసం దుబాయ్‌లోనే ఉండిపోయిన నట్టూ, ఆ తర్వాత అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు...
undefined
బిడ్డ పుట్టిన ఐదు నెలల తర్వాత కళ్లారా చూసుకున్న నట్టూకి... స్వగ్రామంలో అద్భుతమైన స్వాగతం లభించింది... వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, ఊరేగింపుగా నటరాజన్‌కి ఇంటికి తీసుకెళ్లారు...
undefined
ఈ గ్రాండ్ వెల్‌కంపై కూడా స్పందించాడు వార్నర్... ‘నట్టూకి తన గ్రామంలో దక్కని స్వాగతం అతని కష్టానికి ప్రతిఫలం... చాలా సంతోషంగా అనిపించింది...’ అంటూ తెలిపాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్.
undefined
ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగే మొదటి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో నటరాజన్‌కి చోటు దక్కలేదు.... ఇషాంత్ శర్మ రీఎంట్రీ ఇవ్వడంతో నట్టూని వన్డే, టీ20 సిరీస్‌కి ఎంపిక చేసే అవకాశం ఉంది.
undefined
click me!