కోచ్‌ రవిశాస్త్రికే షాక్ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్... ఆదేశాలు పాటించకుండా మైదానంలోకి వెళ్లి ఏం చేశాడంటే...

First Published Jan 23, 2021, 4:06 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో రీఎంట్రీ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్... ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. అయితే సిడ్నీ టెస్టులో మనోడు చేసిన ఓ చిలిపి పని లేటుగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ బయటపెట్టారు.

సిడ్నీ టెస్టులో 407 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియా... రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి పోరాటం కారణంగా మ్యాచ్ డ్రా చేసుకోగలిగింది...
undefined
ధాటిగా బ్యాటింగ్ చేసి 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు చేసిన రిషబ్ పంత్ అవుటైన తర్వాత ఛతేశ్వర్ పూజారా దూకుడు పెంచాడు. 205 బంతుల్లో 12 ఫోర్లతో 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
undefined
272 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా... సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో లాగే మిగిలిన వికెట్లను త్వరత్వరగా కోల్పోయి, చిత్తుగా ఓడుతుందని భావించారంతా...
undefined
అయితే అప్పటికే తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హనుమ విహారితో కలిసి వికెట్లకు అడ్డుగోడలా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్...
undefined
ఈ ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శార్దూల్ ఠాకూర్ డ్రింక్స్ తీసుకుని మైదానంలోకి వచ్చాడు... ఆ సమయంలో అశ్విన్, విహారికి చెప్పాల్సిందిగా ఓ మెసేజ్ పంపాడట హెడ్ కోచ్ రవిశాస్త్రి...
undefined
‘విహారి గాయంతో సింగిల్స్ తీయలేకపోతున్నాడు కాబట్టి బౌండరీలు బాదమని చెప్పు... రవిచంద్రన్ అశ్విన్‌ను డిఫెన్స్ ఆడుతూ వికెట్‌ను కాపాడుకోమ్మను...’ అని చెప్పాల్సిందిగా శార్దూల్‌కి చెప్పి పంపాడట రవిశాస్త్రి...
undefined
అయితే డ్రింక్స్ తీసుకుని పరుగెత్తుకుంటూ వచ్చిన శార్దూల్ ఠాకూర్... ‘మీకు చెప్పమని చాలా చెప్పారు. కానీ అవేమీ నేను చెప్పడం లేదు... మీరు చాలా బాగా ఆడుతున్నారు. అలాగే ఆడండి...’ అంటూ చెప్పాడట.... ఆ మాటలు విని షాక్ అయ్యానని చెప్పాడు అశ్విన్.
undefined
కోచ్ ఆదేశాలను పాటించకుండా ఫ్రీగా ఆడమని శార్దూల్ ఠాకూర్ చెప్పిన మాటలు... తమలో బూస్ట్ నింపాయని... ఒకవేళ రవిశాస్త్రి చెప్పినట్టు విహారి దూకుడు పెంచి అవుట్ అయ్యి ఉంటే, పరిస్థితి మారిపోయి ఉండేదని చెప్పాడు రవిచంద్రన్ అశ్విన్...
undefined
సిడ్నీ టెస్టులో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 50 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే...
undefined
హనుమ విహారి 161 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేయగా, రవిచంద్రన్ అశ్విన్ 128 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 43 ఓవర్లలో 62 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.
undefined
ఆ తర్వాత గబ్బా టెస్టులో రెండేళ్ల తర్వాత రెండోసారిఆరంగ్రేటం చేసిన శార్దూల్ ఠాకూర్... ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయడమే కాకుండా వాషింగ్టన్ సుందర్‌తో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పాడు శార్దూల్.
undefined
రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు తీసి అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్... 2018లోనే టెస్టు ఎంట్రీ ఇచ్చినా, మొదటి మ్యాచ్‌లో 10 బంతులేసి గాయంతో వెనుదిరిగాడు...
undefined
click me!