ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కి కామెంటేటర్‌గా గౌతమ్ గంభీర్... ఇక కామెంటరీలోనూ రచ్చ రచ్చే...

First Published Jan 24, 2021, 9:14 AM IST

ఐపీఎల్‌‌లో అప్పుడెప్పుడో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, అవకాశం దొరికినప్పుడల్లా భారత సారథి విరాట్ కోహ్లీని విమర్శించడానికి రెఢీగా ఉంటాడు. ఇన్నాళ్లు స్పెషల్ ఇంటర్వ్యూల్లో, ట్విట్టర్‌లోనే ఇలాంటి కామెంట్లు చేసిన గౌతీ, ఇప్పుడు ఏకంగా ఇంగ్లాండ్, ఇండియా టెస్టు సిరీస్‌కి వ్యాఖ్యతగా వ్యవహారించబోతున్నాడు.

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన వన్డే, టీ20, టెస్టు సిరీస్‌ సోనీ ఛానెల్‌లో ప్రసారమైన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో చాలామంది ప్రేక్షకులకు ఈ మ్యాచ్‌లు ప్రత్యేక్ష ప్రసారం చూసే అవకాశం దక్కలేదు.
undefined
భారత్, ఇంగ్లాండ్ సిరీస్ మ్యాచులు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌తో పాటు హార్ట్ స్టార్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం కాబోతున్నాయి. హిందీ లాంగ్వేజ్‌ కామెంటేటర్లుగా మాజీ క్రికెటర్లు వ్యవహారించబోతున్నారు...
undefined
ఢిల్లీ మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్‌తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్ పఠాన్, ఆశీష్ నెహ్రా, ఆకాశ్ చోప్రా, హర్భజన్ సింగ్... హిందీలో కామెంటేటర్లుగా వ్యవహారించబోతున్నారు.
undefined
గౌతమ్ గంభీర్ కామెంటరీ బాక్సులో ఉంటే, భారత సారథి విరాట్ కోహ్లీ వ్యూహాలపై విమర్శలు రావడం పక్కా... అందులోనూ గత ఆసీస్ పర్యటనలో ఆసీస్‌పై అజింకా రహానే కెప్టెన్సీతో అదరగొట్టాడు.
undefined
దాంతో కోహ్లీ విఫలమైన ప్రతీసారి... అజింకా రహానే కెప్టెన్సీతో పోలుస్తూ... విరాట్‌ను, ఆయన ఫ్యాన్స్‌ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు గౌతమ్ గంభీర్.
undefined
ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ అన్ని మ్యాచులకు కాకపోయినా వీలైనన్ని మ్యాచులకు అందుబాటులో ఉండి, తన వ్యాఖ్యానంతో హీట్ పెంచబోతున్నారు...
undefined
అదీకాకుండా గౌతమ్ గంభీర్ ఏ క్రికెటర్‌నైనా మెచ్చుకున్నా, ఎవరి గురించైనా ప్రత్యేకంగా ప్రస్తావించినా... వారు తర్వాతి మ్యాచుల్లో ఘోరంగా ఫెయిల్ అవుతారని సెంటిమెంట్ ప్రచారంలో ఉంది...
undefined
గత ఐపీఎల్, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో ఈ విషయాన్ని గుర్తించి, సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్‌ను తెగ ట్రోల్ చేశారు నెటిజన్లు... ఇప్పుడు ఆయన కామెంటరీ ప్యానెల్‌లోనే కనిపించబోతున్నారు..
undefined
గౌతమ్ గంభీర్ లాంటి ఫైర్ బ్రాండ్ కామెంటరీ ప్యానెల్‌లో ఉంటే మీమీ మేకర్స్, విరాట్ కోహ్లీని ఇష్టపడని వారికి పండగే... కోహ్లీ అభిమానులకే చాలా కష్టంగా ఉంటుంది...
undefined
కామెంటరీ ప్యానల్‌లో ఉన్న స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రం ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించలేదు...
undefined
ఇంగ్లీష్ కామెంటేటర్లుగా హర్షా భోగ్లే, నిక్ నైట్, మార్క్ బర్చర్, సునీల్ గవాస్కర్, దీప్ దాస్‌గుప్తా, మురళీ కార్తీక్, లక్ష్మణ్ శివరామకృష్ణన్ వ్యవహారించబోతున్నారు...
undefined
టెస్టు మ్యాచులను హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే ప్రత్యక్షప్రసారం చేయాలని భావిస్తున్న స్టార్ స్పోర్స్, వన్డే, టీ20 సిరీస్‌లో ప్రాంతీయ భాషల్లో కూడా కామెంటరీ జోడించాలని చూస్తున్నట్టు సమాచారం.
undefined
click me!