సన్‌రైజర్స్ బౌలర్లను ఉతికి ఆరేసిన బట్లర్... రాజస్థాన్ భారీ స్కోరు... ఈ మ్యాచ్ కూడా పోయినట్టేనా...

Published : May 02, 2021, 05:23 PM ISTUpdated : May 02, 2021, 05:29 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ మధ్యలో డేవిడ్ వార్నర్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న కేన్ విలియంసన్‌కి ఊహించని విధంగా స్వాగతం పలికారు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు. జోస్ బట్లర్ భారీ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 220 పరుగుల భారీ స్కోరు చేసింది రాజస్థాన్ రాయల్స్...

PREV
17
సన్‌రైజర్స్ బౌలర్లను ఉతికి ఆరేసిన బట్లర్... రాజస్థాన్ భారీ స్కోరు... ఈ మ్యాచ్ కూడా పోయినట్టేనా...

భువనేశ్వర్ కుమార్‌తో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేయించిన కేన్ విలియంసన్, మూడో ఓవర్‌లో‌ రషీద్ ఖాన్‌కి బౌలింగ్ ఇచ్చాడు. 13 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ను అవుట్ చేసిన రషీద్ ఖాన్, తొలి బ్రేక్ అందించాడు.

27

అయితే ఆ తర్వాత కేన్ విలియంసన్ బౌలర్లను మారుస్తూ ప్రయోగాలు చేశాడు. దీంతో జోస్ బట్లర్, సంజూ శాంసన్ అద్భుతంగా చెలరేగిపోయారు. ముఖ్యంగా 2018 సీజన్ తర్వాత పెద్దగా పర్ఫామ్ చేయని బట్లర్, మూడేళ్ల తర్వాత ఐపీఎల్ హాఫ్ సెంచరీ బాదాడు.

37

ఆ తర్వాత 56 బంతుల్లో సెంచరీ బాదిన జోస్ బట్లర్, ఈ సీజన్‌లో సంజూ శాంసన్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరుపున శతకం బాదిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. సంజూ శాంసన్, జోస్ బట్లర్ కలిసి రెండో వికెట్‌కి 150 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదుచేశారు.

47

33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసిన సంజూ శాంసన్, హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అయ్యాడు. విజయ్ శంకర్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ దగ్గర అబ్దుల్ సమద్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు సంజూ శాంసన్.

57

సంజూ శాంసన్ అవుటైన తర్వాత మరింత దూకుడు పెంచిన జోస్ బట్లర్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేసి... సందీప్ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

67

ఆ తర్వాత రియాన్ పరాగ్, 8 బంతుల్లో 15, డేవిడ్ మిల్లర్ 3 బంతుల్లో 7 పరుగులు చేయడంతో భారీ స్కోరు చేసింది రాజస్థాన్ రాయల్స్. డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ నబీ, ఒకే ఓవర్ వేసి 21 పరుగులు సమర్పించుకున్నాడు.

77

ఇంత భారీ లక్ష్యాన్ని చేధించాలంటే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉండాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఉన్న ఇద్దరు ముగ్గురు స్టార్లతో ఈ టార్గెట్‌ను చేధించడం అసాధ్యమే.

click me!

Recommended Stories