ఐపీఎల్ 2021 ఫైనల్ ఆ రెండు జట్ల మధ్యే... మిగిలిన జట్లన్నీ ప్లేఆఫ్ వరకే, ఇక ఫిక్స్ అయిపోండి...

First Published May 2, 2021, 4:46 PM IST

ఐపీఎల్‌లో 8 జట్లు ఆడతాయి. అయితే అందులో ఏడు జట్లు మాత్రం సీఎస్‌కేతో ఫైనల్ ఆడడానికి లీగ్ మొత్తం మ్యాచులు ఆడుతూ ఉంటాయి... ఇది ఐపీఎల్‌లో పాత సామెత. ఆ తర్వాత ఐపీఎల్ 8 జట్లు ఆడతాయి, కానీ అందులో మిగిలిన ఏడు జట్లు, ఫైనల్‌లో ముంబైతో ఓడిపోవడానికి సీజన్ మొత్తం పోరాడతాయి... ఇది కూడా పాత సామెత...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 8 జట్లు ఆడినా, ఆఖరికి ఫైనల్ చేరేది మాత్రం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లే. ఇది చాలా రోజులుగా వినిపిస్తున్న సామెతే... అయినా ఈ సీజన్‌లోనూ ఇదే జరగబోతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చేసింది. అదే విధంగా ముంబై ఇండియన్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘరంగా ఓడించింది... ఆ తర్వాత జరిగిన మ్యాచుల్లోనూ ముంబై పెద్దగా పర్ఫామ్ చేయలేదు.
undefined
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కూడా అద్భుతంగా అదరగొట్టాయి. గత సీజన్‌లో దారుణంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్, గాయపడిన సింహంలా మరింత బలంగా, పటిష్టంగా దూసుకొచ్చింది...
undefined
దీంతో 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్... ఈ మూడు జట్ల మధ్య టైటిల్ కోసం ఫైట్ నడుస్తుందని భావించారంతా... అయితే లేటుగా ఫామ్‌లోకి వచ్చినా... డిఫెండింగ్ ఛాంపియన్ ఆటంటే ఇది అనేలా అదరగొట్టింది ముంబై ఇండియన్స్...
undefined
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 219 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి, అద్భుత విజయం అందుకుంది ముంబై ఇండియన్స్. ఈ విజయం ఇచ్చే ఆత్మవిశ్వాసం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఇది ఆశామాషీ జట్టు మీద వచ్చింది కాదు...
undefined
వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, ఐపీఎల్ 2021 సీజన్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌పై వచ్చింది... సమవుజ్జీల మధ్య సమరంలా మ్యాచ్‌కి ముందు అందరూ ఈ ఫైట్‌ని అభివర్ణించినా ఎక్కడో ముంబై ఫామ్‌పై అనుమానాలు రేగాయి.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన మొదటి ఐదు మ్యాచుల్లో 160+ స్కోరు కూడా చేయలేకపోయిన ముంబై ఇండియన్స్, గెలుపు గుర్రాల్లా దూసుకుపోతున్న సీఎస్‌కేను అడ్డుకోగలదా? అని కొన్ని డౌట్స్ ఉండేవి. అయితే పోలార్డ్ విధ్వంసంతో అవన్నీ పటాపంచలు అయిపోయాయి.
undefined
ఆలస్యమైనా టైటిల్ రేసులో తాము ఉన్నామని మిగిలిన జట్లకి గట్టిగా వినిపించేలా భారీ విజయంతో సాటిచెప్పింది ముంబై ఇండియన్స్. ఇకపై ముంబై ఇండియన్స్ జోరును ఆపడం ఏ జట్టు తరం కాకపోవచ్చు...
undefined
దీంతో మరోసారి ఐపీఎల్ ఫైనల్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్యే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. వీరిని అడ్డుకోగల సత్తా ఉన్న టీమ్‌గా ఒక్క రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే కనిపిస్తోంది...
undefined
ఒకవేళ మరోసారి ముంబై, చెన్నై మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగితే... ఈ రెండు జట్ల మధ్య ఇది ఐదో ఫైనల్ అవుతుంది. ఇప్పటిదాకా జరిగిన నాలుగు ఫైనల్ ఫైట్స్‌లో మొదటిసారి 2010లో సీఎస్‌కేకి విజయం దక్కగా ఆ తర్వాత మూడుసార్లు ముంబై ఇండియన్స్‌కే టైటిల్ దక్కింది.
undefined
రోహిత్ శర్మ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టును ఫైనల్‌లో ఓడించలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి కూడా అదే రిజల్ట్ వస్తే... రోహిత్ ఖాతాలో వరుసగా మూడో టైటిల్‌తో పాటు డబుల్ హ్యాట్రిక్ టైటిళ్లు కూడా చేరిపోవడం ఖాయమంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిస్తే వారి ఖాతాలో నాలుగో టైటిల్ చేరుతుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ కొత్త ఛాంపియన్‌ టీమ్‌ను చూడాలనే ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశ తప్పదు.
undefined
click me!