ఆ ఇద్దరూ రారు, మరి మిగిలిన మ్యాచులకు కెప్టెన్ ఎవరు? సన్‌రైజర్స్‌తో పాటు ఆ జట్టుకి కూడా...

Published : May 30, 2021, 11:44 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ పార్ట్ 2 మ్యాచులు యూఏఈ వేదికగా జరగడం కన్ఫార్మ్ అయిపోయింది. అయితే దాదాపు మూడున్నర నెలల బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమవుతున్న ఈ సీజన్ కారణంగా కొన్ని జట్లకు కెప్టెన్సీ సమస్య ఎదురుకానుంది.

PREV
112
ఆ ఇద్దరూ రారు, మరి మిగిలిన మ్యాచులకు కెప్టెన్ ఎవరు? సన్‌రైజర్స్‌తో పాటు ఆ జట్టుకి కూడా...

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరు మ్యాచులు ముగిసిన తర్వాత డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. కేన్ విలియంసన్‌కి కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.

212

కేన్ విలియంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌కి తుది జట్టులో చోటు కూడా దక్కలేదు. ఇప్పుడు ఐపీఎల్ మిగిలిన మ్యాచులకు కేన్ విలియంసన్ రావడం లేదని కన్ఫార్మ్ అయిపోయినట్టే.

312

అతనితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకి కీలకంగా మారిన బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో కూడా ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. 

412

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ప్రాక్టీస్‌గా ఐపీఎల్ 2021 సీజన్‌ను పరిగణిస్తామని ఆస్ట్రేలియా జట్టు ప్రకటించడంతో డేవిడ్ వార్నర్, మిగిలిన మ్యాచుల్లో పాల్గొనే అవకాశం ఉంది.

512

అయితే ఫస్టాఫ్‌తో తనని అవమానించి, కెప్టెన్సీ నుంచి, జట్టు నుంచి కూడా తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మళ్లీ కెప్టెన్‌గా వ్యవహారించడానికి వార్నర్ భాయ్ ఒప్పుకుంటాడా? అనేది అనుమానంగా మారింది.

612

ఒకవేళ తనను అవమానించిన సన్‌రైజర్స్‌ జట్టు కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవడానికి డేవిడ్ వార్నర్ అంగీకరించకపోతే... ఆరెంజ్ ఆర్మీ కొత్త కెప్టెన్‌ కోసం వెతుకులాట మొదలెట్టాల్సి ఉంటుంది.

712

జట్టులో సీనియర్ ప్లేయర్‌గా ఉన్న పేసర్ భువనేశ్వర్ కుమార్, గతంలో కొన్ని మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే భువీ గాయాలతో సతమతమవుతుండడంతో అతను మిగిలిన ఏడు మ్యాచులకు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది చెప్పడం కష్టమే.

812

ఇక మిగిలినవారిలో కాస్తో కూస్తో రాణిస్తూ, సీనియర్‌గా పేరొందిన మనీశ్ పాండేకి సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ దక్కొచ్చు. అతను కూడా అందుబాటులో లేకపోతే ఏ రషీద్ ఖాన్‌నో, లేక విజయ్ శంకర్‌నో కెప్టెన్‌గా నియమించాల్సి ఉంటుంది.

912

ఇప్పటికే ఏడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, స్టార్ అండ్ మెయిన్ ప్లేయర్లు అయిన కేన్ విలియంసన్, బెయిర్ స్టో వంటి ప్లేయర్లు లేకపోతే కనీస పోరాటం చూపించడం కూడా కష్టమే...

1012

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులాగే సీజన్ ఫస్టాఫ్‌లో స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌దీ ఇదే పరిస్థితి. కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, మిగిలిన సీజన్‌కి అందుబాటులో ఉండడం లేదు.

1112

అతని స్థానంలో ఐపీఎల్ 2019 సీజన్ మొత్తానికి కెప్టెన్‌గా వ్యవహారించిన దినేశ్ కార్తీక్‌కే మళ్లీ కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది. 2020 సీజన్ మధ్యలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

1212

ఇయాన్ మోర్గాన్‌తో పోలిస్తే దినేశ్ కార్తీక్‌కి కెప్టెన్‌గా ఐపీఎల్‌లో మెరుగైన రికార్డు ఉంది. దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ తీసుకోకపోవడానికి ఇష్టపడకపోతే ఆసీస్ ప్లేయర్ ప్యాట్ కమ్మిన్స్‌కి కేకేఆర్ కెప్టెన్సీ పగ్గాలు దక్కొచ్చు. 

click me!

Recommended Stories